వీరిపెళ్లి మామూలుగా జరగలేదు మరి...సముద్ర గర్భంలో జరిగిన పరిణయం

 


విచిత్ర మైన కోరికలు మనుషులకే ఉంటాయి. అట్లాంటి విచిత్ర కోరిక ఒకటి కలిగి ఓ జంట సముద్ర గర్భంలో  పరిణయం ఆడారు. తమిళనాడులోని తిరువన్నామలైకి చెందిన చిన్నదురై.  చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి కోయంబత్తూర్‌కు చెందిన శ్వేతతో పెళ్లి నిశ్చయ మైంది . వివాహం గ్రాండ్ గా చేసుకోవాలని ఆలోచించి ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. సముద్ర గర్భంలో  వెరైటీగా పరిణయం జరుపుకోవాలని  నిర్ణయించుకుని అందు కోసం చాలా కష్ట పడ్డారు. కోచ్ అరవింద్ సహాయంతో ప్రతి రోజు  గజ ఈతగాళ్ళ రక్షణలో సముద్ర గర్భంలో ఆక్సిజన్ సలిండర్లు భుజానికి తగిలించుకుని ప్రాక్టీస్ చేసారు. అనంతరం  నీలాంగర్‌ బీచ్‌ సముద్రగర్భంలో  పెళ్లి వేదిక  ఏర్పాటు చేసుకుని  ఆక్సిజన్‌ సిలిండర్లను తగిలించుకుని… కోచ్‌ అరవింద్‌, మరో ముగ్గురు గజ ఈతగాళ్ల సాయంతో పడవలో సముద్రం మధ్యలోకి వెళ్లారు. అక్కడ సముద్రంలోకి దిగి ఈ తకొడుతూ 60 అడుగుల లోతుకు దిగారు. అక్కడే దండలు మార్చుకున్నారు. జనవరి 1 వ తేదీన (2021) వీరు పరిణయం సముద్ర గర్బంలో జరిగింది. వీరి వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడ రిపోర్ట్ చేసింది. 

అయితే  సముద్ర గర్భంలో పరిణయం ఆడడం వెనకాల ఓ సందేశం ఉందని ఈ జంట మీడియాకు తెలిపింది. రోజు రోజుకూ సముద్ర జలాలు  విసర్జిత జలాలతో బాగా  కలుషితం అవుతున్నాయని అందుకే ఓ మంచి సందేశం  ఇచ్చేందుకు ప్రజల్లో అవెర్ నెస్ కల్పించే ఉద్దేశంతో ఇలాచేశామని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు