ఆస్ట్రేలియా చట్టం - గూగుల్ కు తెచ్చిన కష్టం

ప్రపంచ ఇంటర్నెట్ ధిగ్గజం గూగుల్ కు ఆస్ట్రేలియా చట్టం గుబులు పుట్టించింది. ఆస్ట్రేలియా చేసిన కొత్త చట్టం మేరకు మీడియా సంస్థల వార్తలు షేర్ చేసే సామాజిక మాద్యమాలు ఆయా మీడియా సంస్థలకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఫేస్ బుక్ అయినా, గూగుల్ అయినా లేదా ఇతర ట్విట్టర్, ఇన్స్ట్రా గ్రాం వంటి మాద్యమాలు మీడియా సంస్థలకు కొంత మొత్తం చెల్లించాలి. 

ఈ చట్టాన్ని గూగుల్ మొదటి నుండి వ్యతిరేకిస్తోంది. గూగుల్ సమేసిమిరా అంటూ అవసరం అయితే ఆస్ట్రేలియా లో గూగుల్ సెర్చ్ ఇంజన్ సేవలు నిలిపి వేస్తామంటూ గూగుల్ హెచ్చరిక చేసింది. అయితే ఆస్ట్రేలియా మాత్రం ఈ హెచ్చరికకు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తమ కొత్త చట్టాన్ని సమర్దిస్తే తప్ప అనుమతించ బోమని ఖరా ఖండిగా స్పష్టం చేసింది.  వార్తల లింకులను తన సెర్చ్ ఫలితాల్లో చూపించడం ద్వారా గూగుల్, ఫేస్‌బుక్‌లు వినియోగదారులను ఆకర్షించగలుగుతున్నాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం వాదిస్తోంది. ఈ కారణంగానే.. వాటి ఆదాయంలో కొంత మొత్తాన్ని మీడియా సంస్థలతో పంచుకో వడంలో తప్పులేదని స్పష్టం చేసింది. 

ఈ నేపధ్యంలో టెక్ ధిగ్గజం మైక్రో సాఫ్ట్  గూగుల్ కు షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా చట్టానికి పూర్తిగా ఆమోదం తెలిపింది.

 ఆస్ట్రేలియా సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్ వాటా ఏకంగా 93 శాతం ఉందని గణాంకాలు తెలియ చేస్తున్నాయి. 

గూగుల్ కు ప్రత్యామ్నాయంగా బింగ్ వంటి సెర్చ్ ఇంజన్ ను మైక్రో సాఫ్ట్ ప్రస్తావిచడంతో ఆస్ట్రేలియా  ప్రధాని ఇటీవల కీలక ప్రకటన చేసారు. గూగుల్ స్థానాన్ని భర్తీ చేసే శక్తి తమకు ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత సత్యా నాదెళ్ల తనతో వ్యాఖ్యానించినట్టు ఆయన వెల్లడించారు.  ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ చేసిన ప్రకటన ఆస్ట్రేలియా-గూగుల్ వివాదాన్ని సరి కొత్త మలుపు తిప్పింది. ‘డిజిటల్ వేదికలు, సంప్రదాయిక వార్త సంస్థల మధ్య సమతుల్యం సాధించేందుకు ఈ చట్టం ప్రధానం ఉద్దేశ్యం. ఇందిలో మా ప్రస్తావన లేకపోయినప్పటీ.. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశిస్తే ఈ చట్టానికి మేము బద్ధులమై ఉంటాము’ అని మైక్రోసాఫ్ట్  పేర్కొంది.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు