ఉత్తము డనిపించుకున్న ఉత్తమ ఫోటో జర్నలిస్టు హరీష్

 

పాల వ్యాపారి సాంబయ్యకు ఫోన్ అంద చేస్తున్న  ఫోటో జర్నలిస్టు హరీష్ 

మంచి పనులు చేసి పలువురికి ఆదర్శంగా నిలిచి అభినందనలు పొందటం ఉత్తముల పని. ఫోటో జర్నలిస్టు  వీరగోని హరీష్ ఆలాంటి  ఉత్తమ పని చేసి అందరి అభినందనలు అందుకున్నాడు. ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో ఫోటో జర్నలిస్టుగా వరంగల్ లో  విధులు నిర్వహిస్తున్న హరీష్ విధి నిర్వహణలో భాగంగా బుధవారం కాజీపేట దర్గా సమీపంలో ఇందిరమ్మ ఇళ్ల కాలనీకి వెళుతుండగా రోడ్డుపై  ఎవరో పొగొట్టుకున్న ఆండ్రాయిడ్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ పొగొట్టు కున్న వ్యక్తిని వెదికే ప్రత్నం చేసాడు.  కాని ఆచూకి  లభించ లేదు. కొద్ది గంటల విరామం తర్వాత సాంబయ్య అనే పాల వ్యాపారి తాను పొగొట్టుకున్న ఫోన్ కు డయల్ చేయడంతో హరీష్ ఫాన్ తనవద్దే ఉందని వివరాలు తెలిపాడు. పాల వ్యాపారి  వద్దకు వెళ్ళి హరీష్ అతనికి ఫోన్ అంద చేసాడు. 

ఉత్తమ పనిచేసిన హరీష్ ను జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు పలువురు అభినందించారు. వృత్తిపరంగా కూడ  హరీష్ పలు మార్లు  ఉత్తమ ఫోటో గ్రాఫర్ గా అవార్డులు అందుకున్నాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు