బైబిల్ కావాలో..భగవద్గీత కావాలో తిరుపతి ఓటర్లు తేల్చుకోవాలి - బండి సంజయ్

 ఎపి పాలిటిక్స్ పై బండి సంజయ్ విసుర్లు - జగన్ లర్కార్ ను టార్గెట్ చేసిన బండి సంజయ్


తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ ఎపి పాలిటిక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్ పార్టి కార్యాలయంలో ప్రజా గాయకుడు దరువు ఎల్లన్న  బండి సంజయ్ అధ్వర్యంలో  బిజెపిలో చేరాడు. ఈ సందర్భంగా బండి సంజయ్ తెలంగాణ రాజకీయాలతో పాటు ఆంధ్ర రాజకీయాలపై కూడ వ్యాఖ్యలు చేసారు. తిరుపతి లోక్ సభ స్థానానికి త్వరలో జరగ బోయే ఉప ఎన్నికల్లో బండి సంజయ్ స్టార్ కాంపెయిన్ కానున్నారనే వార్తలు వెలు వడ్డాయి. ఈ మేరకు బండి సంజయ్ తిరుపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ ను టార్గెట్ చేసారు.

ఏపీలో ఒకే మతం రాజ్యమేలు తోందని ప్రజల సహనాన్ని చేతగాని తనంగా భావించవద్దని బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కితే ఆయన మూటా ముల్లే సర్దుకోవాలని ధ్వజమెత్తారు. తెలంగాణలానే ఏపీకి కూడా షాక్ ట్రీట్‌మెంట్ తప్పదని ఆయన అన్నారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. బైబిల్ కావాలో..భగవద్గీత కావాలో తిరుపతి ఓటర్లు తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలే తిరుపతి ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ఆయన జోస్యం చెరప్పారు.

ఇక ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రోజుకో చోట విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. హిందూ దేవాలయాలపై దాడులు జరిగే వారిని కఠినంగా శిక్షించాలని.. ఆలయాకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. హిందువుల సహనాన్ని పరీక్షించవద్దని.. వారు తలుచుకుంటే ఏం జరుగుతుందో జగన్ ఊహించుకోలేరని మండిపడ్డారు బండి సంజయ్. వైసీపీ ప్రభుత్వం మూటాముల్లే సర్దుకునేలా తరిమికొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోని హిందువులు కులాల పేరుతో విడిపోవద్దని.. ఒక ఓటు బ్యాంకుగా మారి బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు