రైతుల దెబ్బకు దిగివచ్చిన రిలయన్స్ - కార్పోరేట్ వ్యవసాయంలో ఒప్పందాలు చేసుకో మంటూ ప్రకటన


వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు  రిలయన్స్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్(ఆర్ఐఎల్‌) ా సెల్ టవర్లపై ఆగ్రహ జ్వాలలు వెల్లగక్కడంతో ఆ సంస్థ దిగి వచ్చింది. కేంద్రం తీసుకు వచ్చిన కొత్త చట్టాలతో రిలయన్స్  కంపెనీల వంటి కార్పోరేట్ వ్యవస్థలు లాభ పడతాయని ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో కంపెని సవివరంగా ప్రకటన విడుదల చేసింది. పంజాబ్,హర్యానా  రాష్ట్రాలలో రైతులు  రిలియన్స్ కంపెనీకి చెందిన వంద లాది జియో సెల్ టవర్లను అనేకం నేల మట్టం చేసారు. రిలయన్స్ ఫ్రెష్ లను కూడ మూసి వేశారు. దాంతో భారీగా నష్టం జరుగుతోందని రిలియన్స్ కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. తమ కమ్యునికేషన్  టవర్లను కూల్చడం  వెనకాల కుట్ర కోణం ఉందని  ఇదంతా తమ ప్రత్యర్థి వ్యాపార సంస్థలు ధ్వంసం చేయిస్తున్నాయని  రిలియన్స్ ఆరోపించింది. ఈ మేరకు తమ సంస్థకు చెందిన కమ్యూనికేషన్ టవర్లను ధ్వంసం చేయడంపై పంజాబ్, హరియాణా హైకోర్టులో రిలయన్స్ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విధ్వంసం నుంచి తమ ఉద్యోగులు, ఆస్తులను కాపాడేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. 

అట్లాగే తమ సంస్థ రైతుల ఉత్పాదనలు ఏవి కొనుగోలు చేయ బోదని తమకు కాంట్రాక్ట్ లేక కార్పొరేట్ వ్యవసాయ వ్యాపారం (ఫార్మింగ్ బిజినెస్‌)లోకి ప్రవేశించే ప్రణాళికలు లేవని వెల్లడించింది. దానికి సంబంధించి తాము ఎటువంటి భూమిని కొనుగోలు చేయలేదని, భవిష్యత్తులో అలాంటి ఆలోచనలు కూడా లేవని స్పష్టం చేసింది. తక్కువ ధరలకుండే ఏ దీర్ఘకాలిక సేకరణ ఒప్పందంలోకి తాము ప్రవేశించాలని భావించడం లేదని తెలిపింది. ‘‘రైతులు కష్టపడి పండించిన పంటలకు లాభదాయకమైన ధర లభించి, వారి కృషికి ప్రతిఫలం లభించాలన్నదే రియలన్స్, దాని సంబంధిత సంస్థల అభిమతం. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతుకే కట్టుబడి ఉండాలని మా సరఫరాదారులనూ మేం కోరుతున్నాం.’’ అని రియలన్స్ పేర్కొంది.  రైతుల నుంచి నేరుగా తాము పంటలను కొనుగోలు చేయమని, కేవలం ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం మాత్రమే తమ సరఫరాదారులు కొనుగోలు చేస్తారని స్పష్టం చేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు