అంత్యక్రియలకు వెళ్లి 25 మంది మృత్యులోకాలకు


ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియలు జరిపించేందుకు వెళ్లి ప్రమాదం భారిన పడి 25 మంది మృత్యులోకాలకు వెళ్లారు. ఘజియాబాద్ జిల్లా లోని ఉఖ్ లార్సి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం తమ భందువు చనిపోగా అంత్యక్రియలు జరిపించేందుకు స్మశాన వాటికకు తీసుకు వెళ్లారు. అంత్యక్రియలు జరుగుతుండగా భారి వర్షం ప్రారంభం కావడంతో తల దాచుకునేందుకు ఓకట్టడం కిందకు వెళ్ళారు. సుమారు 50 మందికిపైగా కట్టడం కింద  ఉండగా జోరు వర్షంలో ఆ కట్టడం కుప్ప కూలి పోయింది. కట్టడం కింది ఉన్నవారంతా శిథిలాల్లో కూరుకు పోయి చనిపోయారు.ఇప్పటి వరకు 25 మంది మృత దేహాలను వెలికి తీసారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం అసుపత్రులకు తరలించారు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. 

సంఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన అక్కడికి చేరుకుని గ్రామస్థుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. జరిగిన ఘోర దుర్ఘటన పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోది, రాష్ట్ర పతి రాం నాధ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

ముగ్గిరిని అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రమాదానికి కారణమైన కట్టడం (రూఫ్) ఇటీవలే నిర్మించారు.నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడం వల్లే కూలిపోయిందనే విమర్శలు వచ్చాయి. నిర్మాణ లోపాలకు భాద్యులైన ఇంజనీర్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు