ఊరూరా..వాడ వాడలా..ఇంటింటా తొలి మహిళా మహోపాధ్యాయురాలు మా.. సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు

   



సత్యశోధక్ సమాజ్ వ్యవస్థాపకురాలు,తొలిమహిళా మహోపాధ్యాయిని, భారతీయ సంఘ సంస్కర్త, క్రాంతి జ్యోతి, 'మాజీ' సావిత్రి బాయి పూలే 190వ జయంతి ఉత్సవాలు ఊరూరా, వాడ వాడలా ఇంటింటా మహోన్నతంగా జరుపుకున్నారు. అజ్ఞానాంధ కారాన్ని పార దోలేందుకు జ్ఞాన జ్యోతులు వెలిగించిన దివ్య జ్యోతి సావిత్రిబాయి 'మాజీ'. పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ స్వీయ శ్రద్దాసక్తులతో  'మాజీ' సేవామార్గాన్ని గుర్తు చేసుకున్నారు. సమాజానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు.

హైదరాబాద్ నాాచారం అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్ భవన్ లో "మా " సావిత్రి బాయి పూలే జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న  అంబేద్కర్ పూలే యువజన సంఘం నాయకులు


గడిచిన ఒకటి రెండు దశాబ్దాలతో పోల్చి చూసుకుంటే బహుజన విద్యావేత్తల్లో గణనీయ మైన మార్పులు వచ్చాయి. తమ ఉద్దరణ కోసం జన్మించిన మహనీయుల మార్గం అనుసరిస్తూ వారి జ్ఞాన భోదనలను ప్రచారం చేస్తూ కవితలు రచనలు కొనసాగిస్తూ తర తరాలు ఏవి మరిచి పోకుండా అందరికి సదా గుర్తుండే రీతిలో మహనీయుల జీవిత చరిత్రను సజీవంగా నిలుపు తున్నారు. అణగారిన వర్గాలు, బహుజన రాజ్యం కోసం భీజం వేసిన సాహు మాహరాజ్ మొదలు  సామాన్యులే  రాజ్యాధికారులు కావాలనే కాంక్షతో రాజ్యాంగ రచన చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్, సమాజ సంస్కర్తలు జ్యోతి రావు పూలే, "మా జీ" సావిత్రి బాయి పూలే వంటి మహనీయుల జయంతి వర్దంతి ఉత్సవాలు క్రమం తప్పకుండా పాటించడం బహుజనుల్లో చెప్పు కోవల్సిన పురోగతి.

'మాజీ' సావిత్రి బాయి పూలే 190వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఊరూ వాడా ఇంటింటా పండగ వాతావరణం కనిపించిందంటే ఇది మామూలు మార్పని చెప్పలేం.

 సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సోషల్ మీడియాలో అయితే పుంఖాను పుంఖాలుగా వర్తమానాలు వెల్లువెత్తాయి. జ్ఞాన భోదనలు, కవితలు, కొటేషన్లతో కూడిన ఫోటోలతో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. ఇది బహుజన వర్గాల్లో వచ్చిన పెద్ద మార్పు.  ఇవన్ని చూస్తుంటే సమీకరించు భోదించు పోరాడు అన్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఉద్బోధ వాస్తవ రూపం దాల్చేేందుకు బహు జన భందు వర్గాలు అంతా ఎంతో దూరంలో లేరని పిస్తోంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు