జర పైలం...ఆందోళన కలిగిస్తోన్న జన్యుమార్పిడి కరోనా


కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే మనల్ని వీడేటట్టు లేదు. మానవాళికి సవాలు గా మారిన ఈ మహమ్మారిని జయిస్తామన్న  ధీమా శాస్త్ర వేత్తల్లో ఆశాజనకంగా కనిపిస్తున్నా జన్యు మార్పుల ద్వారా తన ఉనికిని మూర్చుకుంటున్న కరోనా మహమ్మారి మరో వైపు ఆందోళనకు గురి చేస్తోంది. అహోరాత్రులు కష్ట పడి శాస్త్ర వేత్తలు రూపొందించిన వాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటు లోకి వచ్చిందనే సంతోషం కూడ మిగల కుండా జన్యుమార్పిడి జరిగిన కరోనా కలవర పరుస్తున్నది. అందుకే జర జాగ్రత్త అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేసింది.

ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క కరోనా స్ట్రెయిన్ వెలుగు లోకి వచ్చిందనుకుని దాన్ని కట్టిడి చేసేందుకు హైరానా పడుతుమటే మరో మూడు స్ట్రెయిన్లువెలుగు చూసినట్లు ఆరోగ్య సంస్థ వెల్లడించింది.  అంతే కాదు గత ఏడాది కాలంగా ఈ కొత్త వేరియంట్లు వ్యాప్తిలోకి వచ్చి ఉండవచ్చని కూడ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గత సంవత్సరం జనవరిలో  డీ614జీ జన్యు మార్పు కలిగిన ఓ కొత్త స్ట్రెయిన్ ఉనికిలోకి వచ్చిందని తెలిపింది.  ఆ తరువాత..ఈ స్ట్రెయిన్‌యే అత్యధికంగా వ్యాపించిందని చెప్పింది. జూన్ 2020 నాటికి అత్యధిక శాతం కేసులు ఈ స్ట్రెయిన్ కారణంగానే సంభవించాయట. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మూడో స్ట్రెయిన్ బయటపడింది. డెన్మార్క్‌లో తొలిసారిగా ఉనికి లోకి వచ్చిన ఈ స్ట్రెయిన్‌కు శాస్త్రవేత్తలు క్లస్టర్-5గా పేరుపెట్టారు. మనుషుల రోగ నిరోధక శక్తిని  ఎదుర్కునే విదంగా ఈ  స్ట్రెయిన్ జన్యుమార్పిిడ జరిగి ఉంటుందిన శాస్త్ర వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

బ్రిటన్ లో కనుగున్న కరోనా స్ట్రెయిన్ కు ఫైలోజెనిటిక్ సంబంధం లేకపోవడంతో ఈ వైరస్ జన్మరహస్యం అంతుచిక్కని రహస్యంగా మారింది.

దక్షిణాఫ్రికాలో మరో స్ట్రెయిన్ కళ్లు తెరిచింది భయాందోళనలు కలుగు చేసింది. అయితే..దక్షిణాఫ్రికా, బ్రిటన్‌లకు చెందిన స్ట్రెయిన్ల కారణంగా వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పు రాలేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి చెందే వేగం మాత్రమే పెరిగిందని అంటున్నారు.

 కరోనా అనేది ఆర్‌ఎన్ఏ వైరస్ కాబట్టి సహజంగానే వాటిలో జన్యుమార్పులు చోటు చేసుకుంటాయని అంతగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదని శాస్త్ర వేత్తలు ధైర్యం నింపుతున్నారు. మానవాళిని అతలా కుతలం చేసిన అంతుచిక్కని  వైరస్ పట్ల నిరంతరం అప్రమత్తత అవసరమనేది స్పష్టం అవుతోంది.

గుట్టు విప్పిన భారత్..

ఇంగ్లండ్ లో మొదటగా కనిపించి ఇప్పుడు నెమ్మదిగా ప్రపంచానికి విస్తరిస్తున్న స్ట్రెయిన్ గుట్టును భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కరోనా వైరస్ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి దాని ఆనుపానులు కనుగొనడానికి నిరంతరాయంగా పరిశోధనలు సాగిస్తున్న భారత్ లోని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు ఆ క్రమంలోయుకె కొత్తస్ట్రెయిన్ గుట్టు విప్పడంలో కృతకృత్యులయ్యారు. ఇంగ్లండ్ నుంచి ఇటీవల మన దేశానికి వచ్చి కొత్త స్ట్రెయిన్ కారణంగా కరోనా బారిన పడిన వారి నుంచి సేకరించిన నమూనాల ద్వారా చేసిన పరిశోధనల్లో దాని గుట్టును శాస్త్రవేత్తలు చేదించ గలిగారు .ప్రపంచంలో ఈ విజయం సాధించిన దేశం మనదే కావడం విశేషం..ఈ పరిశోధన కొత్తస్ట్రెయిన్ అక్క ను ఎదుర్కొని అవసరమైన నివారణలు..చికిత్సల ప్రయోగాలకు ఉపయోగ పడుతుంది.ఈ కొత్త తరహా వైరస్ ను ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న వాక్సిన్లు సమర్థంగా ఎదుర్కో గలవన్న ఆశావహ సమాచారం ఇప్పటికే ఉంది..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు