చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కు షాక్ - పార్టీకి గుడ్ బై చెప్పిన ముఖ్య నేత

 పశ్చిమ నియోజక వర్గంలో తెరాసకు ఎదురు దెబ్బ- సీనియర్ నేత సాంబయ్య పార్టీకి రాజీనామా - బిజెపిలో చేరనున్నట్లు చర్చ -సాంబయ్య బాటలోనే మరి కొందరు తెరాస నేతలు - త్వరలో బిజెపి గూటికి



ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రాతినిద్యం వహిస్తున్న వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో తెరాస సీనియర్ నేత కోరబోయిన సాంబయ్య పార్టీకి షాక్ ఇచ్చారు.పార్టి ఆవిర్బావం నుండి 20 ఏళ్లుగా పార్టీలో పనిచేసిన సాంబయ్య  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వానికి రాజీ నామా చేశారు. తన రాజీనామా లేఖలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పార్టి  వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్,  మంత్రి యెర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా పార్టి ఇన్ చార్జి గ్యాదరి బాల మల్లులకు పంపించారు.

సాంబయ్య తాను ఏ పార్టీలో చేర బోయేది ఇంకా ప్రకటించక పోయినా బిజెపిలో చేరనున్నారనే చర్చ జరుగుతోంది.  ఇప్పటికే బిజెపి రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ తో సాంబయ్య సంప్రదింపులు జరిపారని ఒకటి రెండు రోజుల్లో తన అనుచుర గణంతో పార్టీలో చేరేందుకు సిద్ద పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. 

2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి ఆవిర్బావం నుండి పనిచేసిన సాంబయ్య పార్టీని వీడటం తెరాసకు ప్రధానంగా దాస్యం వినయ్ భాస్కర్ కు పెద్ద దెబ్బని పార్టీలో చర్చ జరుగుతోంది. క్రియాశీలక కార్యకర్తగా  తెలంగాణ ఉద్యమ కారుడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన సాంబయ్య  పార్టీలో పలు పదవులు నిర్వహించారు. 2001 లో జరిగిన ఎన్నికల్లో హన్మకొండ జెడ్పిటిసిగా తెరాస నుండి  ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్టి ఉద్యమ కార్యాచరణలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2009 నుండి 2018 వరకు జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో దాస్యం వినయ్ భాస్కర్ గెలుపు కోసం చాలా కృషి చేశాడు. వరంగల్ మేయర్ పదవి ఇస్తామని పార్టి హామి ఇస్తే 2016 జిడబ్ల్యు ఎంసి ఎన్నికల్లో 37 వ డివిజన్ నుండి కార్పోరేటర్ గా పోటి చేసి అత్యధిక మెజార్టీతో గెలు పొందారు. సాంబయ్యకు మేయర్ పదవి ఇవ్వాల్సి  ఉండగా చివరి నిమిషం వరకు ఊరించి పదవి ఇవ్వ లేదు. మరే దైనా ప్రాధాన్యత కలిగిన పదవి ఇస్తారని ఆశించి ఎదురు చూసిన  సాంబయ్యకు నిరాశే మిగిలింది.  

పార్టీలో చిత్త శుద్దితో పనిచేసినా ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా మద్యలో వచ్చిన తెలంగాణ ద్రోహులకు అనేక మందికి పదవులు ఇచ్చి తీవ్ర మానసిక వేదనకు గురి చేశారని సాంబయ్య రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణ ఉద్యమ కాలంలో అన్ని విధాలుగా నష్టం పోయి అహర్నిశలూ ఉద్యమం కోసం పార్టి కోసం పనిచేసిన వారికి అన్యాయం చేసారని తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన 1200 మంది అమరుల బలిదానాలను ఆపహాస్యం చేసే విదంగా తెలంగాణ ప్రజలు ఆశించిన దానికి భిన్నంగా పార్టి  నాయకత్వం వ్యవహరించడం భాద కలిగించిందని అన్నారు. పార్టి అనుసరించిన తప్పుడు విధానాల వల్ల ఉద్యమ కాలంలో పార్టీకి లభించిన ప్రజల ఆదరణ విశ్వాసం క్రమంగా కోల్పోయిందని అన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న  పార్టి ఇంకా ముందు ముందు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చాలా మంది పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నారని సాంబయ్య తెలిపారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు