30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు- గేట్లు తెరిస్తే ఆగమే- బండి సంజయ్

 


భారతీయ జనతా పార్టి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ ప్రకటనలు అధికార తెలంగాణ రాష్ట్ర  సమితి పార్టీ శ్రేణులను కలవర పరుస్తున్నాయి. బండి సంజయ్ విసుర్లకు తెరాస నేతలు కౌంటర్ కూడ ఇచ్చే స్థితిలో కనిపించడం లేదు. మా తో టిఆర్ఎస్ ,కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యేలు 30 మంది టచ్ లో ఉన్నారు...మేం గేట్లు తెరిస్తే ఆగమే ...కాని రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించవద్దని ప్రోత్సహించడం లేదని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీకి లైన్ క్లియర్ గా ఉందన్నారు. 2023 ఎన్నికల్లో బిజెపి అధికారం లోకి రావడం ఖాయమన్నారు.

జిహెచ్ఎంసి నూతన పాలక మండలి ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎన్నికలు జరిగి నెల రోజులు కావచ్చినా ఇంకా మేయర్ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ కొత్తగా ఎంపికైన జిహెచ్ఎంసి కార్పోరేటర్లతో కల్సి   బండి సంజయ్ రాష్ర్ట గవర్నర్ తమిళి సై సౌందర రాజన్  ను  కల్సి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టంలో ఎన్నికల కమీషన్ రాష్ట్ర ప్రభుత్వం రెండూ కల్సి పోయి రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు చేశారు. రాజ్యాంగం ప్రకారం వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారి చేయాలని  డిమాండ్ చేసారు. కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లు ఖాళీగా ఉంటే పాత కార్పోరేటర్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు.తెరాస కార్పోరేటర్లు అడ్డగోలుగా అవినితీ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.  బిజెపి కార్యకర్తలను టిఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేస్తోందన్నారు. ఎంఐఎం సహకారం తోనే నగరంలో తెరాస కార్పోరేట్ స్థానాలు గెలుచు కుందనన్నారు. 

రాష్ట్రంలో తమ పార్టీకి లైన్ కలియర్ గా ఉందన్నారు. భవిష్యత్ లో బిజపిలో చేరతానని  కాంగ్రేస్ పార్టి ఎమ్మెల్సి కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చేసిన ప్రకటనపై స్పందిస్తూ ఆయనను కల్సి పార్టీలో చేరమని అహ్వానిస్తామన్నారు.

బండి సంజయ్ వెంట గవర్నర్ ను కల్సిన వారిలో  ఎమ్మెల్యే రాజా సింగ్,ప్రభాకర్, రాం చంద్రారెడ్డి, ప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు