హథ్రాస్ కేసు కళంకిత ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బదిలి

 


ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌ జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్‌ కుమార్‌ ను ప్రభుత్వం  బదిలి చేసింది. దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలకు దారి తీసిన హత్రాస్ అత్యాచార ఘటనలో కేసును తారు మారు చేసి సాక్షాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించిన వారిలో ఉన్నతాధికారులు కీలక పాత్ర పోషించారు. స్వయంగా హథ్రాస్ జిల్లా మెజిస్ట్రేట్  ప్రవీణ్ కుమార్ లక్ష్కర్ నిందితుల పక్షాన వకాల్తా పుచ్చుకోవడం దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశం అయింది. సెప్టెంబర్‌ 14న హథ్రాస్‌కు చెందిన 19 ఏండ్ల దళిత బాలికపై నలుగురు ఆగ్ర వర్ణాల యువకులు అత్యాచారం జరిపి తీవ్రంగా హింసించారు. తీవ్రంగా గాయపడిన భాదితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 25 న మరణించింది.  రాత్రికి  రాత్రే భాదితురాలికి బలవంతంగా అంత్యక్రియలు జరిపారు. భాదిత కుటుంబ సబ్యులను జిల్లా మెజి స్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తో పాటు పోలీసు అధికారులు బెదిరింపులకు గురి చేశారని విమర్శలు వచ్చాయి. అధికారులు వ్యవహరించిన తీరుపై అలహాబాద్ హై కోర్టు బెంచ్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. అధికారిపై ఎందుకు చర్యలు తీసు కోలేదని హై కోర్టు ప్రభుత్వాన్ని  ప్రశ్నించింది. 

సిఎం యోగి ఆదిత్య నాధ్ ప్రభుత్వానికి హథ్రాస్ ఘటన మాయని మచ్చగా మిగిలింది.   అసలు అత్యాచారమే జరగ లేదనే కోణంలో పోలీసు అధికారులు నిందితులతో  కల్సి కేసును తారు మారు చేయాలను కుంటే దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లు బికడంతో   సిఎం యోగి ఆదిత్యనాధ్ సి బిఐ విచారణకు ఆదేశించారు. హై కోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరుగుతోంది. జరిగింది అత్యాచారమేనని నిందితులపై సిబిఐ చార్జ్ షీట్ నమోదు చేసింది. 

ఈ కేసులో  పక్షపాతంగా వ్యవహరించిన జిల్లా మెజిస్ట్రేట్ ఐఏఎస్ హోదాను రద్దు చేయాలి. ఐఏఎస్ అధికారులు సిగ్గు పడేలా ఆ అధికారి వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి.  అయినా యోగి సర్కార్ అధికారులపై  చర్యలు తీసుకోక పోవడంపై విమర్శలు వచ్చాయి. కోర్టు మంది లించడంతో చివరికి గత్యంతరం లేని పరిస్థితిలో 16 మంది ఐఏఎస్ అధికారుల ను మూకుమ్మడిగా బదిలి చేస్తూ యెగి సర్కార్ జారిచేసిన ఉత్తర్వుల్లో  ప్రవీణ్ కుమార్ కూడ ఉన్నారు. హథ్రాస్ కేసులో ప్రవీణ్ కుమార్ ఓ కళంకిత అధికారిగా మిగిలి పోయాడు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు