గుడికో గోమాత ప్రారంభించిన టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి

 హైదరాబాద్ లోని వెంకటేశ్వర ఆలయంలో ప్రారంభం
ఎపి,తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఎన్ని ఆలయాలకు గోవులు


తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమాన్ని గురువారం తెలంగాణ రాష్ర్టంలో టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ లోని జూబ్లి హిల్స్  శ్రీవెంకటేశ్వర ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించారు. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్, ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల ఆధ్వ‌ర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమమం మొదట ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెల 7 వ తేదీన విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభించారు. 

ఈసదంర్బంగా టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ  హిందూ ధర్మ రక్షణలో భాగంగా టీటీడీ గుడికో గోమాత కార్యక్రమాన్ని  ప్రారంభించిందని అన్నారు. గోవుికు పురాణాల్లో అత్యధిక ప్రాధాన్యత ఉందని గోవు ఉన్న చోట సుభిక్షం ఉంటుందని అన్నారు. ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంతో నే గుడికో గోవు కార్యక్రమం చేపట్టామని చెప్పారు.కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడ గోవు లిస్తామన్నారు. మూడు రాష్ట్రాలలో ప్రతి  గుడికి గోవును అంద చేస్తామని తెలిపారు. ఇందు కోసం దాతల నుండి దేశ వాలి గోవులు స్వీకరిస్తున్నామని తెలిపారు. 

మ‌ఠాలు, పీఠాలు, వంశ‌పారంప‌ర్య ప‌ర్య‌వేక్ష‌ణ ఆల‌యాలు, దేవాదాయ శాఖ ప‌రిధిలోని ఆల‌యాలు, వేద పాఠ‌శాలల‌కు ఈ కార్య‌క్ర‌మం ద్వారా టీటీడీ గోవుతో పాటు దూడను అంద‌జేస్తుందన్నారు. గోదానం పొందిన ఆల‌యాలు, పీఠాలు, వేద‌ పాఠ‌శాల‌లు గోవుల సంర‌క్ష‌ణ బాధ్య‌త తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్వీ గో సంర‌క్ష‌ణ‌శాల అనుమ‌తితో భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మానికి గోవుల‌ను దానం చేయాల్సి ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు