హరీశ్ రావు ఆణిముత్యం - సిద్దపేటను అప్పగించినందుకు పేరు నిలబెట్టిండు-సిఎం కెసిఆర్

 అల్లుడు హరీశ్ రావును ఆకాశానికి ఎత్తిన ముఖ్యమంత్రి 

 


సిద్దపేటలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ అల్లుడు పరీశ్ రావును ఆకాశానికి ఎత్తాడు. ఇక్కడి నుండి  వెళ్ళేప్పుడు ఆణిముత్యం లాంటి నాయకుడిని ఇచ్చానని  పరీశ్ రావు సిద్ది పేటను అన్ని రకాలుగా  తీర్చి దిద్ది అద్భుతాలు ఆవిష్కరించి తన పేరు నిలబెట్టాడని ప్రశం సించారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజి భవణం, డబుల్ బెడ్ రూం ఇండ్లు,  రైతు వేదిక ప్రారంభించారు.  అనంతరం డిగ్రీ కాలేజీలో జరిగిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడారు. 

'సిద్దిపేట మామూలు పేట కాదు.. తెలంగాణను సిద్దింపజేసిన గడ్డ. సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణే లేదు. నేను రవాణా మంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేట రింగురోడ్డును నిర్మించా. ఇప్పుడు హరీశ్ రావు దాన్ని డబుల్ రోడ్డు చేశాడు. గతంలో సిద్దిపేట అభివృద్ధి కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. గతంలో సిద్దిపేటకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమలు చేసిన పథకాన్నే ఇప్పుడు దేశం మొత్తం విస్తరింపజేశాం. అదే మిషన్ భగీరథ. ఇప్పుడు 98.3 శాతం ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించింది' అని కేసీఆర్ అన్నారు.  సిద్ది పేటపై సిఎం వరాళ జల్లు కురిపించారు. రంగనాయకసాగర్‌ను టూరిస్ట్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రంగనాయకసాగర్‌ పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించారు. అలాగే రుకోడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.80 కోట్లు మంజూరు చేశారు. 160 కోట్లతో రాజీవ్‌ రహదారిని విస్తరిస్తామని హామీ ఇచ్చారు. నెలలోపు సిద్దిపేటలో బస్తీ దవఖానాను ఏర్పాటు చేస్తామన్నారు. 


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు