ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

 

ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని డిమాండ్వార్త విలేఖరి సంతోష్ ను చంపుతానంటూ బెదిరించిన ఎమ్మెల్యే గూడెండ మహిపాల్ రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం వివిద జర్నలిస్టుల సంఘాల అధ్వర్యంలో  రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు చేసారు. శేర్లింగం పల్లి ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో చందానగర్ లో అంబేద్కర్  విగ్రహం నుండి గాంధి నగర్ విగ్రహం వరకు నిరసన ర్యాలి నిర్వహించి ఎమ్మెల్యే దిష్టి బొమ్మను దగ్దం చేసారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ సాగర్, జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.  సంతోష్ కు ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంతోష్ కు ఆయన కుటుంబానికి ఏదైనా జరిగితే అందుకు ఎమ్మెల్యే గూడురు మహిపాల్ రెడ్డి పూర్తి భాద్యతలు వహించాలని అన్నారు. 

 మెదక్ లో ఐజెయు జర్నలిస్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి విరహత్ అలి అధ్వర్యంలో  జర్నలిస్టులు నిరసన ర్యాలి నిర్వహించారు.  గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో  జర్నలిస్టులు ఆందోళన జరిపారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు