2023 లో బిజెపి జెండా ఎగరడం ఖాయం - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి



2023 లో బిజెపి జెండా ఎగరడం ఖాయ మన్న  కిషన్ రెడ్డి

కెసిఆర్ కెటిఆర్, ఓవైసి బట్టలిప్పుకుని తిరిగినా బిజెపిని అడ్డుకోలేరు

 

రాష్ట్రంలో భారతీయ జనతా పార్టి అధికారం లోకి రావాలని ప్రజలు ఉద్యోగులు, యువకులు,మహిళలు కోరుకుంటున్నారని  కెసిఆర్,కెటిఆర్,ఓవైసిలు బట్టలు విప్పుకుని తిరిగినా బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరని 2023 లో అధికారం ఖాయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

కిషన్ రెడ్డి శుక్రవారం వరంగల్ నగరంలో పర్యటించారు.  కేంద్ర మంత్రిగా పదవి భాద్యతలు చేపట్టిన తర్వాత  తొలి సారిగా వచ్చిన మంత్రికి పార్టి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా భద్రకాళి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. కాకతీయ మెడికల్ కాలేజి ఆవరణలో నిర్మాణం పూర్తి చేసుకున్న సూపర్ స్పెషాలిటి భవణం పరిశీలించారు. జైన్ మందిర్ సందర్శించారు. అనంతరం అధికారులతో కేంద్ర పథకాలపై సమీక్ష నిర్వహించారు.  పార్టి కార్యకర్తల సమావేశంలో మాట్లాడి గ్రేటర్ ఎన్నికలకు దిశా నిర్దేశం చేసారు. బూత్ లెవల్ వరకు కమిటీలు ఏర్పాటు చేసి పటిష్టంగా పనిచేయాలని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బిజెపి పోరాడుతోందని అదే రీతిలో  తెలంగాణ కెసిఆర్ ను గద్దె దించేందుకు పని చేయాలని అన్నారు.

వరంగల్ నగరంతో తనకు ఉన్న అనుభందం గుర్తు చేసుకుని వరంగల్ లో తనకు అణువణువు తెల్సని అన్నారు.వరంగల్ చైతన్య వంత మైన ప్రాంతమని రజాకార్లను తరిమి కొట్టిన గడ్డని తెలంగాణ ఉద్యమంలో తెగువ చాటిన ప్రాంతమని కొనియాడారు.

మొదటి అడుగు దుబ్బాకలో పడింది..రెండో అడుగు హైదరాబాద్ లో పడింది. మూడో అడుగు వరంగల్ లో పడాలని జరగబోయే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్నారు.  రాష్ట్రంలో తండ్రి కొడుకుల కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్య పాలన రావాలని అది బిజెపితోనే సాధ్యమని అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోది దేశంలో ఒక్క రోజు కూడ సెలవు తీసుకోకుండా పనిచేస్తే రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ఒక్క రోడు కూడ సెక్రటేరియట్ కు వెళ్ళకుండా పాలన చేస్తున్నాడని విమర్శించారు. మోది అవినీత రహిత పాలన  అందిస్తుంటే కెసిఆర్ వేలకోట్ల రూపాయల అవినీతితో పాలన సాగిస్తున్నాడని దుయ్యబట్టారు.

వరంగల్ నగరం సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని వేల కోట్ల రూపాయలు ఇస్తే కెసిఆర్ ఓక్క రూపాయి కూడ ఇవ్వకుండా నగరాన్ని నిర్లక్ష్యం చేశాడని విమర్శించాడు. ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా కేంద్రం 150 కోట్లతో మల్టి సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మిస్తే రాష్ర్టం తన వాటాగా ఇచ్చే 30 కోట్ల నిధులలో కేవలం 10 కోట్లు మాత్రమే ఇచ్చి మిగతావి ఇవ్వలేదని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే తెలంగాణ లో కెసిఆర్ అమలు చేయడం లేదన్నారు.

కాకతీయ కళాసంపద పరిరక్షణకు ప్రధాని 500 కోట్లు మంజూరు చేసి మొదట 196 కోట్లు విడుదల చేస్తే సిఎం ఒక్క రూపాయి కూడ ఇవ్వలేదన్నారు.వరంగల్ స్మార్ట్ సిటి ప్రాజెక్టుకు రూ 2,7740 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం అయ్యాయని అన్నారు. వరంగల్ లో రూ 385 కోట్లతో  రైల్వే ఓరలింగ్ ప్రాజెక్టు చేపట్టేంజుకు కేంద్రం సిద్దంగా ఉందని ఈ ప్యాక్టరి వస్తే వేల మందికి ఉపాధి అవకాశాలు లబిస్తాయని అయితే ఇంత వరకు భూమి కేటాయింపు పూర్తి కాలేదని అన్నారు. భద్రకాళి చెరువు బండ్ ఆధునీకరణకు రూ 31 కోట్లు మంజూరు చేశామని అన్నరు. నగర ప్రధాన కూడళ్ళ అభివృద్ధికి కూడ నిధులు ఇచ్చామని తెలిపారు. మాము నూర్ ఎయిర్ పోర్టుకు అవసరమైన భూమి కేటాయిస్తే విమానాశ్రయం ఏర్పాటు చేసందుకు కేంద్రం  నుండి పూర్తి భాద్యత తీసుకుంటామని అన్నారు.


పార్ట్ కార్యకార్యకర్తల విస్తృత స్తాయి సమావేశంలో వరంగల్ జిల్లా ఎర్బన్ అధ్యక్షు రాలు రావు పద్మ, ఎంపి గరిక పాటి మోహన్ రావు, మాజి మంత్రి విజయ రామారావు, మాజి ఎమ్మేల్యే ధర్మారావు, వన్నాల శ్రీరాములు, మాజి మేయర్ డాక్టర్  టి రాజేశ్వర్ రావు,ప్రేమేందర్ రెడ్డి, నరహరి వేణుగోపాల్ రెడ్డి,  రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు