సింగర్ సునీత నిశ్చితార్దం


 సింగర్ సునీత రెండో వివాహం కాయమైంది. ఇది గాసిప్ మాత్రం కాదు. సునీత పెండ్లి విషయంలో గతంలో అనేక రూమర్లు వచ్చాయి. కాని సోమవారం సునీత నిశ్చాతార్ధం బిజినెస్ మాన్  రామ్ వీరప నేని తో జరిగి పోయింది. ఇందుకు సంభదించిన ఫోటోలను స్వయంగా సునీత ట్వీట్ చేసింది. 

అందరి తల్లుల లాగే నేను నాపిల్లల  శ్రేయస్సు  కోరాను. నా పిల్లలు కూడ నా శ్రేయస్సు కోరి నేను సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. నా జీవిత భాగస్వామిగా నాకు తోడు నీడగా నిలిచేందుకు మంచి మనసున్న వ్యక్తి  రామ్ నాకు తోడయ్యాడు అంటూ తన కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన నిశ్చితార్దం ఫోటోలతో సునీత ట్వీట్ చేసారు. 

రామ్ నా జీవితంలో ఒక ముఖ్యమైన స్నేహితుడిగానే, ఓ అద్భుతమైన భాగస్వామిగా రాబోతున్నాడు. మేము ఇద్దరం అతి త్వరలో వివాహం చేసుకోబుతున్నాం. నేను నా జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచాలని చూస్తాను.. అది అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఈ విషయంలో దయచేసి మీరు ఎప్పటిలాగే నాకు మద్దతు ఇవ్వాలనీ కోరుకుంటున్నాను అని పోస్ట్ చేసారు. సునీత పెండ్లి విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సహచర సినిరంగ కళాకారులు, అభిమానులు స్నేహితులు భందువులు  అనేక మంది సునీతకు అభినందనలు తెలియ చేసారు. 

సింగర్ గా టివి రంగ డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు చిత్ర సీమలో ఓ సెలబ్రేటీగా  స్థిర పడి పోయిన సునీతకు గతంలో గోపరాజు కిరణ్ కుమార్ అనే వ్యక్తితో తన 19వ ఏటనే పెండ్లి జరిగింది. వారికి అక్షయ్, శ్రేయ అనే కుమారుడు కూతురు ఉన్నారు. అయితే సునీత తన మొదటి భర్తతో గొడవల కారణంగా చట్టబద్దంగా విడాకులు పొంది చాలా కాలం అయింది. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు