కేంద్రంపై కెసిఆర్ - కెసిఆర్ పై బిజెపి

 కేంద్రంపై కెసిఆర్ పోరు - కెసిఆర్ పై బిజెపి పోరు
పరస్పర  రాజకీయ ఆలాయ్ బలాయ్


తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టి పరస్పర  రాజకీయ ఆలాయ్ బలాయ్ కి సిద్ద పడ్డాయి.  దుబ్బాకలో లభించిన విజయ వెంటనే లభించిన గ్రేటర్ ఎన్నికల్లో భాతీయ జనతా పార్టీ కారుక ుబ్రేకులు వేస్తూ అత్యధికంగా కార్పోరేట్ స్థనాలు గెలుచు కోవడంతో  దూకుడు పెచింది. మరో వైపు కెసిఆర్ కేంద్రం విధానాలపై దాడి మొదలు ఆరంభించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వ్చచిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ  ఈ నెల 8 న జరిగే భారత్ బంద్ కు కెసిఆర్ సంఘీభావం ప్రకటించారు. ఇకపై కేంద్రం విధానాలపై నేరుగా కెసిఆర్ యుద్ధానికే సిద్దపడినట్లు ఆ పార్టి వర్గాలు చెప్పుకుంటున్నాయి. 

కెసిఆర్ ఓ వైపు కేంద్రంలో నరేంద్ర మోది  పై రాజకీయంగా పోరుకు సిద్ద పడితే మరో వైపు తెలంగాణలో మంచి జోష్ లో ఉన్న బెజిపి నాయతులు కెసిఆర్ పై పోరుకు సిద్దపడ్డారు.

ఇక కెసిఆర్ భరతం పడతామని ఆయన అవినీతి చిట్టా అంతా తమ దగ్గర ఉందని కోర్టులో చిట్టా అంతా విప్పుతామంటూ ఢిల్లీలో ఉన్న  రాష్ట్ర పార్టి అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించారు.  సిని నటి విజయ శాంతి సోమవారం తిరిగి  తన స్వంత గూడుకు అయిన బిజెపిలో చేరారు.  పార్టి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్బంగా బండి సంజయ్ కెసిఆర్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ అవినీతిపై కోర్టులో కేసువేస్తామని అన్నారు.  ఎల్ఆర్ ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేసారు. రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 

బండి సంజయ్ వ్యాఖ్యలు తేలికగా తీసు పారేయ లేమని కెసి ఆర్ కు చెక్ పెట్టేందుకే బండి సంజయ్ నోటి వెంట వచ్చిన మాటల వెనక బిజెపి అగ్ర నేతులు అయిన అమిత్ షా,జెపి నడ్డా  వ్యూహం ఉండ వచ్చనే  చర్చ జరుగుతోంది. మొత్తానికి తెలంగాణలో టిఆర్ఎస్, బిజెపి మద్య ఇక రాజకీయ దుమారం మొదలై నట్లే నని అంటున్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు