అభిమానులకు షాక్...పార్టి పెట్టడం లేదన్న రజనీ కాంత్

 


తమిళ నాడు సూపర్ స్టార్ రజనీ కాంత్  అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఇది. డిసెంబర్ 31 వ తేదీన పార్టీ పేరు ప్రకటించాల్సిన రజనీ కాంత్ పార్టీ పెట్టే ఆలోచన లేదని చల్లగా ప్రకటించారు. దాంతో రజనీ కాంత్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయ పార్టి పెట్టే ఆలోచన విరమించుకున్నట్లు వార్తలు వచ్చాయి.  రజనీ కాంత్ కూడ ట్విట్టర్ లో మూడు పేజీల ఉత్తరం పోస్ట్ చేశారు. తాను రాజకీయాల్లోకి రాక పోయినా ప్రజలకు మాత్రం సేవ లందిస్తానని రజనీ కాంత్ పేర్కొన్నారు.

రాజకీయాల్లోకి వస్తున్నానని రజనీ కాంత్ ప్రకటించి సన్నాహాలు మొదలు పెట్టిన అనంతరం కొద్ది రోజుల క్రితం ఆయన అస్వస్థకు గురయ్యారు.  బిపి సమస్యలు తలెత్తడంతో ఆయనను హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేసారు. కోలుకున్న అనంతరం ఆసుపత్రి నుండి నేరుగా డిస్ చార్జ్ అయి చెన్నై చేరుకున్న రజనీకాంత్  తన కుటుంబ సబ్యులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం రాజకీయాల్లోకి రావడం లేదంటూ అభిమానులారా క్షమించండంటూ ట్వీట్ చేసారు.

 రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడని స్వతంగా పార్టి పెట్టబోతున్నాడనే వార్తం ఎంతగా హాట్ టాపిక్ అయిందో పార్టి పెట్ట టం లేదన్న వార్త కూడ అంతే ప్రాధాన్యత సంతరించుకుంది.  మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగ బోతున్న తమిళనాడులో  ఇప్పటికే కమల్ హాసన్ పార్టి ఏర్పాటు చేసి  ప్రచారం కూడ మొదలు పెట్టారు. ఓటర్లను ఆకట్టుకునే విదంగా ఆయన పార్టి ఎన్నికల హామీలను ప్రకటిస్తున్నారు. రజనీ కాంతో పార్టి ఏర్పాటు చేస్తే తమిళ నాడులో కమల్ హాసన్ పరిస్థితి ఏంటనే చర్చ కూడ జరిగింది. 

ఇద్దరు ఆగ్ర శ్రేణి నటుల రాజకీయ  ప్రవేశం తమిళ నాడులో ఏ మలుపుకు దారి తీయనుందో ననే ఆసక్తి నెల కొన్న నేపద్యంలో  రజనీ కాంత్ చేసిన ప్రకటన కమల్ హాసన్  అభిమానులకు మాత్రం కొంత ఊరట కలిగించిందనే చెప్పవచ్చు. ఓ అగ్రశ్రేణి నటుడికి మరో అగ్రశ్రేణి నటుడు పోటీలో లేక పోవడం వల్ల కమల్ కు కల్సి వచ్చే  అవకాశాలు మెండుగా ఉంటాయని అభిమానులు ఓ అంచనాతో ఉన్నారు. మొదట రజనీ కాంత్ పార్టి పెడతారనే వార్తతో కమల్ హాసన్ స్వాగతం పలుకుతూ కల్సి పోటీ చేస్తామంటూ స్నేహస్తం చాటారు.  అయితే రజనీ కాంత్ ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయంలో ఇంకా స్వంత ఆలోచన లేవి లేక పోవడంతో అనేక ఊహాగానాలతో వార్తలొచ్చాయి. బిజెపి కూటమితో ఆయన పార్టి పొత్తు ఉంటుందనే వార్తలు కూడ వచ్చాయి. 

రజనీకాంత్ తన పార్టి జిల్లాల భాద్యులతో అనేక దఫాలుగా మంతనాలు జరిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూటమికి వ్యతిరేకంగా రాజకీయాల్లో ఉండాలని కోరినట్లు  తెల్సింది. అయితే ఏ విషయంలో కూడ స్పష్టతకు రాలేక పోయిన రజనీ కాంత్ కు ఇంతలోనే అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. 


మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ నిరాశ

 కొత్త పార్టీ ప్రకటనను ఉపసంహరించుకుంటానని రజనీ చేసిన ప్రకటన తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని కమల్ తెలిపారు. అయితే రజనీ ఆరోగ్యం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ‘ఎన్నికల క్యాంపెయినింగ్ తర్వాత రజనీకాంత్‌‌ను తిరిగి కలుస్తా. ఆయన నిర్ణయంపై అభిమానుల్లాగే నేనూ నిరాశ చెందా’ అని కమల్ చెప్పారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు