సిఎం కెసిఆర్ గుడ్ న్యూస్..ప్రకటనల మీద ప్రకటనలు..ఉత్తర్వులపై ఉత్తర్వులు

 ప్రగతి భవన్ నుండి పరుగులు పెడుతున్న పాలన 

పాత ఫైళ్ల దుమ్ము దులిపి మరీ ఫైస్లా చేస్తున్న సిఎం
ప్రజలు నిరసన తెలిపిన పథకాలు ఎత్తి వేత
పాత ఏడాది ఆఖరి గడియలు...కొత్త ఏడాది ఆసన్న ఘడియల్లో తెలంగాణ  సిఎం కెసీఆర్ గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ ప్రకటిస్తున్నారు. సిఎం ఆదేశాలతో రాష్ట్రంలో  గంటకో ఉత్తర్వు జారి అవుతోంది. ఏసంగి పంటలకు సంభందించిన రైతు భందు పెండింగ్ పైసలు రైతుల అక్కౌంట్లలో వేశారు. ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని అధికారులను అదేశించారు. సిఎం నిర్ణయాలు పలువురిని విస్మయానికి గురి చేస్తున్నాయి. 

 దుబ్బాక ఉప ఎన్నికలు, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల ప్రభావమేనా ఇది అంటూ సంభ్రమాశ్చర్యాలు పోతున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళి  తిరిగి వచ్చిన అనంతరం సుమారు రెండు వారాల పాటు సిఎం ఫాం హౌజ్ నుండి బయటికి రాలేదు.ఫాం హౌజ్ లో  ఏం చేశారో ఏం కసరత్తు జరిగిందో ఏమో కాని తిరిగి వచ్చిన అనంతరం ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మొదటగా పంటల నియంత్రిత సాగు ఎత్తి వేయడమే కాక ఇక నుండి ధాన్యం, మక్క జొన్నలు కొనుగోలు చేయబోమంటూ ఓ బాంబు వేశారు. అట్లాగే నీటి పారుదల వనరులన్నింటిని ఒకే శాఖ గొడుగు కిందకు చేర్చారు. 

సిఎం మంగళవారం తాజాగా ఎల్ఆర్ఎస్ కు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సర్కార్ విధించిన లింకు ఎత్తి వేసారు.ఇక నుండి పాత రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఆస్ లింకుకు సంభందం లేకుండానే రిజిస్ట్రేషన్లు జరగ నున్నాయి. అయితే కొత్తగా లేఅవుట్ ప్లాట్లకు మాత్రం ఎల్ఆర్ఎస్ ఉంటే తప్ప రిజిస్ట్రేషన్లు జరగవు. ఇది కొంత వరకు ప్రజలకు ఉపయోగ పడే నిర్ణయమే. వ్యవసాయేతర ఆస్తులకు ధరణి పోర్టల్ తో పాటు ఎల్ఆర్ఎస్ కు లింకు పెట్టి నప్పటి నుండి రిజిస్ట్రేషన్లు నిలిచి పోయాయి. ఓ వైపు కరోనా దెబ్బ మరో వైపు సిఎం అసంబద్దమైన ఆంక్షల దెబ్బతో ప్రజలు అతలా కుతలం అయ్యారు. 

దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో వ్యవసాయేతర ఆస్తుల నిర్ణయాలు, ఎల్ఆర్ఎస్ పథకం నిర్ణయాలు ప్రచారాస్త్రాలయ్యాయి. అధికార పార్టీని  ఓడిస్తే తప్ప ఇవన్ని ఎత్తి వేయడం సాధ్యం కాదని బాగా ప్రచారం చేశారు. చెప్పినట్లే జరిగింది. అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగలడంతో  అందరూ అనుకున్నట్లే  ఒక్కొక్కటి ఎత్తి వేయడంతో పాటు గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా సిఎం అడుగులు పడుతున్నాయి.

ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల విషయంలో కూడ సిఎం గుడ్ న్యూస్ చెప్పారు. 

ఆర్టీసి తో సహా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు పెంచనున్నట్లు ప్రకటించారు. అట్లాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ  విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులను సగౌరవంగా ఇంటికి ప్రభుత్వ వాహనంలో సాగ నంపాలని  అదే రోజు అన్ని బెనిఫిట్స్ అందే విదంగా చూడాలని అధికారులను ఆదేశించారు.  కారుణ్య నియామకాల విషయంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఫిబ్రవరి నుండి ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తి చేపడతామని చెప్పారు. సర్కార్ ఉద్యోగుల బదిలి విషయంలో కూడ తీపి కబురు చెప్పారు. పదోన్నతుల విషయంలో జాప్యం లేకుడా తక్షణం అమలు చేస్తామన్నారు.

నిరుద్యోగుల భృతిపై ప్రకటన ఏది ?

ఇవన్ని ఓ ఎత్తు అయితే 2018 ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు  ఇస్తామన్న భృతి మరో ఎత్తు. అయితే అన్ని శుభ ప్రకటనలే చేసిన ముఖ్యమంత్రి నిరుద్యోగ భృతి విషయంలో ఎలాంటి ప్రకటన చేయక పోవడం గమనార్హం.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు