ఆన్ లైన్ మైక్రో ఫైనాన్స్ రుణాల మోసగాళ్లను అరెస్టు చేసిన వరంగల్ పోలీసులు


 మొబైల్ యాప్స్ ద్వారా  ఆన్ లైన్ మైక్రో ఫైనాన్స్  నిర్వహిస్తున్న మోసగాళ్ళను ఒక్కొక్కరిని పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాాద్ పోలుసులు అనేక మందిని అరెస్టు చేయగా వరంగల్ పోలీసులు ఆదివారం మరో  ముగ్గురు నిందితులను అరెస్టు చేసారు.

ఇన్ స్టంట్ రుణాల పేరిట రుణాలు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారి ఆటకట్టించిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు

 ఇన్ స్టంట్ లోన్ యాప్స్ తో ఘరానా మోసానికి పాల్పతున్న ఐదుగురు సభ్యుల అంతర్జాతీయ ముఠాలోని ముగ్గురు సభ్యులను వరంగల్ కమిషనరేట్ సైబర్ క్రైం మరియు జనగాం పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు.

 పోలీసులు అరెస్టు చేసిన వారిలో బెంగుళూర్ కు చెందిన దేబాశిప్ దాస్, చిక్కాబానవాడీ, సంతోష్ కుమార్ నాయక్ ఉన్నారు. చైనాకు చెందిన ఇద్దరు ప్రధాన నిందితులు ఎర్రీక్ పెన్ గ్లూ, పాడ్రా బిన్దా రాయ్ ఫరారీలో ఉన్నారని వరంగల్ పోలీస్ కమీ,నర్ పి ప్రమోద్ కుమార్ తెలిపారు.

 నిందితుల నుండి 2 ల్యాప్ లు, పలు సిమ్ కార్డులు, 3సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాలను ఇలా ఉన్నాయి.  వ్యాపార వీసాపై గత సంవత్సరం భారతదేశానికి వచ్చిన చైనా దేశస్థుడు ఎర్రీక్ పెగ్లూ, ఒడిషా రాష్ట్రానికి చెందిన పాడ్రా బిన్ దా రాయ్ తో కలిసి నాలుగు రకాల ఇన్ స్టంట్ లోన్ యాప్లను రూపొందించి షైన్ బే టెక్నాలజీ ప్రవైయిట్ లిమిటెడ్ అనే పేరుతో బెంగుళూర్ సిటీలో ఓ కార్యాలయం  ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులైన దేబాశిప్ దాస్, సంజయ్ బిఆర్,సంతోష్ కుమార్ నాయక్ సహకారంతో ఫాస్ట్ క్రెడిట్ యాప్ల  ద్వారా చట్టవ్యతిరేకంగా ఇన్ స్టంట్ రుణాలు ఇచ్చారు.

నిందితులు రూపొందించిన యాప్ ద్వారా అందజేసే రుణాల క అధిక వడ్డీలతో పాటు కనిపించని చార్జీల పేరుతో డబ్బు వసూళ్ళ పాల్పడ్డారని కమీ,నర్ తెలిపారు. రుణాలు చెల్లించ లేని పరిస్థితిలో ఫోన్ల ద్వారా బెదిరించి వేధింపులకు గురి చేసే వారని తెలిపారు.  రుణ గ్రహీతలతో అసభ్యకరమైన రీతిలో వ్యవహరించేవారని అన్నారు.

వీరి మాయలో పడి  జనగాం జిల్లా కేంద్రంలోని గుడ్లగడ్డ ప్రాంతానికి చెందిన బండారు శ్రీనివాస్ అవసరం కోసం ఆన్ లైన్  యాప్ ద్వారా 4వేల రూపాయలను రుణంగా తీసుకుని తిరిగి రుణం తీర్చక పోవడంతో  వేధించారని తెలిపారు.

వారి వేధింపులు భరించలేక భాధితుడు బండారు శ్రీనివాస్ ఈ నెల 18వ తేదిన జనగాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు వెస్ట్ జోన్ డి.సి.పి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో నిందితులను పట్టుకోనేందుకు సైబర్ క్రైం టీంతో పాటు జనగాం పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. బెంగుళూరు కేంద్రంగా నిందితులు యాపుల ద్వారా రుణాలు ఇస్తున్నారని తెల్సుకుని వారిని బెంగుళూర్ లో  అరెస్ట్ చేసి  అక్కడే కోర్టులో హాజరు పరిచి అనంతరం జనగామకు తీసుకు వచ్చారు.  నిందితులను  జనగామ కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ కు ఆదేశించింది. 

నిందితులను  అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన జనగాం ఇన్ స్పెక్టర్ మల్లీశ్వర్, సైబర్ క్రైం ఇన్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, జనగాం, సైబర్ ఎస్.ఐలు రవికుమార్, సతీష్, అసిస్టెంట్ ఆనాటికల్ ఆఫీసర్లు ప్రశాంత్, సల్మాన్ సైబర్ క్రైం సిబ్బంది రాజు, కిశోర్, జనగాం హెడ్ కానిస్టేబుల్ జకీర్, కానిస్టేబుల్ అనిల్ ను పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్  అభినందించారు.

ఇనా స్టాంట్ రుణాలు పేరిట మొబైల్ యాపుల ద్వారా వల వేసే వారి పట్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇలాంటి మోసగాళ్ళ భారిన పడిన వారు పోలీసులకు సమాచారం అంద చేాయాలని సూచించారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు