ఆన్ లైన్ లోన్ యాప్ ల భరతం పట్టే దిశగా పోలీసులు

25 ఆన్ లైన్ లోన్ యాప్ లపై కేసులు నమోదు


ఆన్లైన్ లోన్ యాప్ ల భరతం పట్టేందుకు పోలీసులు సిద్దం అయ్యారు. తెలంగాణ రాష్ర్టంలో  ఆన్ లైన్ లోన్ల ఉచ్చులో చిక్కి ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబ సబ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసారు. ఈ యా ప్ లు ఎవరు ఆన్ లైన్లో ఉంచారో చట్ట రీత్యా ఎలాంటి అనుమతులు ఉన్నాయే విచారణ జరపనున్నారు. ఫైనాన్స్ నడిపేందుకు తీసుకునే లసెన్సులు పొంది ఆన్ లైన్ లోన్ యాపులతో వల వేసి వ్యాపారం నిర్వహిస్తుండవచ్చనిపోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు విచారణ ముందుకు సాగితే కాని ఆన్ లైన్ యాపుల భాగోతం బయట పడదు. 

సిద్దిపేట జిల్లాకు చెందిన ఏఇవో గా పనిచేస్తున్న మౌనిత అనే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ రాంజేంద్ర నగర్ కిస్మత్ పూర్ కు  చెందిన సాప్ఠ్ వేర్ ఇంజనీర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్ లైన్ లో 70 వేల అప్పు తీసుకున్నాడు.  ఆ అప్పు తీర్చేందుకు మరోయాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు. అప్పులు వాటి వడ్డీలు పెరిగి డిఫాల్ట్ కావడంతో అతని తల్లికి ఫోన్ చేసి బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. దాంతో తీవ్ర మన స్థాపానికి గురైన  సునీల్ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సునీల్ భార్య రమ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సిద్ది పేటకు చెందిన మౌనిక కేసులో కూడ ఆన్ లైన్ లోన్ నిర్వాహకుల వేధింపులే కారణమని పోలీసులు నిర్దారణకు వచ్చారు. మూడు లక్షల వరకు మౌనిక అప్పు తీసుకోగా డిఫాల్ట్ అయ్యిందని ఆమెను వేధింపులకు గురి చేసారు.

దాంతో ఈనెల 14 వ తేదీన మౌన్క ఇంట్లో పురుగుల మందు తాగింది. మౌనికను ఆసుపత్రకి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఆన్ లైన్ లోన్ వ్యాపారాలు ఎక్కువగా ఒకటి రెండు రాష్ట్రాల నుండే జరుగుతున్నాయి. ఉత్తరాధి రాష్ట్రాల నుండి వచ్చిన వారు ఈ వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కొన్ని ఫైనాన్స్ సంస్థల వారు ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన సాలరి అక్కౌంటు కు చెందిన డెబిట్ కార్డులు ముందే తీసుకుని అధిక వడ్డీలకు అప్పులిచ్చి వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే భాదితులు అత్యవసరాల కోసం అధిక వడ్డీలకిచ్చి వసూలు కోసం ప్రైవేట్ గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఆన్ లైన్ లోన్ యాపుల నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తే తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. ఆన్లైన్ యాపులు మాయలో పడి బాంకు అక్కౌంట్ నెంబర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు తొందర పడి ఇవ్వ కూడదని సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు