జగన్ ఓ ఫేక్ ముఖ్యమంత్రి - చంద్రబాబు నాయుడు

 




జగన్ మోహన్ రెడ్డి ఓ ఫేక్ ముఖ్యమంత్రి నా దగ్గర ఆయన ఆటలు సాగవు..జగన్‌రెడ్డికి దమ్ముంటే రెఫరెండానికి సిద్ధం కావాలి 45 రోజుల్లో ఎవరి ప్రచారం వారు చేసుకుందాం..జగన్ గెలిస్తే.. తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు సవాల్ చేశారు.

గురువారం అమరావతి రైతులు ఏర్పాటు చేసిన జనభేరీ సభలో  ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉంటుందని సీఎం చెప్పాలన్నారు. తాను అధికారం కోసం పోరాడడం లేదని చంద్రబాబు అన్నారు. అధికారం తనకు కొత్త కాదని, 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని, ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పారు. ప్రజల హక్కులను కాపాడుతున్నామని, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ముందుకెళ్తున్నామన్నారు. 

పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి నీరు, మట్టి తీసుకొచ్చాం. ప్రధాని పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చారు. సాక్షాత్తు పార్లమెంట్ మీకు అండగా ఉంటుందని ప్రధాని చెప్పారు. జగన్ గాలి కబుర్లు చెప్పడం ఇప్పటికైనా మానుకోవాలి. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిదంటున్నారు.. 19 నెలల్లో ఏం పీకారు. అమరావతిలో నాకు ఇల్లు లేదంటున్నారు.. మీరు కట్టి ఏం పీకారు. ఒక కులంలో పుట్టడం నా తప్పా?. కులం చూసి హైదరాబాద్‌, విశాఖను అభివృద్ధి చేయలేదు. నా దగ్గర జగన్ తెలివి తేటలు పనిచేయవు. ద్రౌపది వస్త్రాపహరణం చేసినందుకు సామ్రాజ్యం కూలిపోయింది. మహిళల శాపంతో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

ప్రణమిల్లిన చంద్రబాబు నాయుడు



చంద్రబాబు ఉద్దండరాయునిపాలేనికి వెళ్లి అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడే సాష్టాంగ నమస్కారంతో ప్రణమిల్లాడు  అక్కడి శిలాఫలకాన్ని పరిశీలించారు. శంకుస్థాపన చేసిన ప్రదేశంలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు