హత్రాస్ ఘటన పై సిబిఐ చార్జ్ షీట్

 

 నిందితులపై  పలు సెక్షన్ల కింద కేసులు

జరిగింది సామూహిక అత్యాచారమేనని నిర్దారించిన సిబిఐ


హత్రాస్ దళిత యువతిపై జరిగింది సామూహిక అత్యాచారమేనని సిబిఐ నిర్దారించింది. అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షణలో  విచారణ కొనసాగిస్తున్న సిబిఐ ఈ మేరకు అచ్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులపై ఛార్జి షీట్ దాఖలు చేసింది. నలుగురు యువకులు అత్యాచారం చేయడమేకాక తీవ్ర చిత్ర హింసలకు గురి చేసిన అభియోగంపై సిబిఐ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. సెక్షన్ 302 కింద హత్యా నేరం,సెక్షన్ 376డీ కింద అత్యాచారం చేసిన కేసుతో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసారు.

సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ గ్రామానికి చెందిన బోయ  సామాజిక వర్గానికి చెందిన 19 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు అత్యాచారం చేసి చిత్ర హింసలు పెట్టిన సంఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. తల్లితో కల్సి పశువులకు  గడ్డి  కోసుకు వచ్చేందుకు చేనుకు వెళ్లిన యువతి మెడకు దుపట్టా బిగించి లాక్కెళ్ళి  చిత్ర హింసలు పెట్టి అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబ సబ్యులు ఆరోపించారు.  ఉన్నత కుల సామాజిక వర్గానికి చెందిన నిందితులు సందీప్,రవి,రాము,లవకుష్  లను కేసు నుండి తప్పించేందుకు పోలీసుల ప్రయత్నాలు జరిగాయని దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. భాదితురాలిపై అత్యాచార ఘటనను ఎవరికి చెప్పకుండా నాలుక కోసి వెన్నముక విరిచి దారుణంగా హింసించారు. ఢిల్లీ అసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మరణించింది.  మరణించిన తర్వాత బాదితురాలి మృత దేహాన్ని రాత్రికి రాత్రి గ్రామానికి తరలించి  పోలీసులు అర్ద రాత్రి అంత్య క్రియలు జరిపించడం పలుప అనుమానాలకు తావిచ్చింది.  ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ సర్కార్ పై ఈ ఘటన చూపుడు వేలు ఎక్కుపెట్టడంతో  ఆయన సెప్టెంబర్ 30 వ తేదీన విచారణకు ఆదేశించారు.  భాదితు రాలు సెప్టెంబర్ 29 వ తేదీన చనిపోగా అదే రాత్రి అంత్యక్రియలు జరిపించారు. 

భాదిత కుటుంబ సబ్యులను హత్రాస్ గ్రామ అగ్ర కుల సామాజిక వర్గం పెద్దలు ప్రలోభాలకు గురి చేశారు. వారు లొంగక పోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. అయినా వారు ధైర్యంగా న్యాయం కోసం పట్టుబట్టారు. వారికిదేశ వ్యాప్తంగా మద్దతు లభించడంతో యోగి సర్కార్ ఇరకాటంలో పడింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు