పఠాన్ చెరు ఎమ్మెల్యే కేసును విచారించిన హైకోర్టు

జర్నలిస్టును బెదిరించిన సంఘటనలో  పఠాన్ చెరుఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కేసును విచారించిన హైకోర్టు.  
తనను చంపుతానని బెదిరించిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు లో రిట్ పిటీషన్ దాఖలుచేసిన జర్నలిస్ట్ సంతోష్

సంతోష్ తరపున వాదించిన న్యాయ వాది ఉమేష్ చందర్ 


తనను దూషించిన ఎమ్మెల్యే పై హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసిన జర్నలిస్టు సంతోష్ నాయక్. శుక్రవారం పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు. పోలీసులు నామ మాత్రంగా కేసు నమోదు చేసిన ఎమ్మెల్యే పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని  పిటీషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చందర్ కోర్టుకు తెలిపారు.

ఎస్సి, ఎస్టీ కేసులో అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారన్న పిటీషనర్ తరపు న్యాయవాది

ప్రజాస్వామ్యం లో ఫోర్థ్ ఎస్టేట్ లో ఉన్న ఒక జర్నలిస్టు ను బెదిరించడం, దూషించడం పత్రిక స్వేచ్ఛ కు భంగం కలిగించడమేనని కోర్టుకు తెలిపారు పిటీషనర్ తరపు న్యాయవాది. స్థానిక ప్రజా ప్రతినిధి గా ఉండి ఈ విధంగా వ్యవహరించిన ఎమ్మెల్యే ను వెంటనే అరెస్ట్ చేసే విదంగా ఆదేశాలు ఇవ్వాలని న్యాయ వాది కోరారు. 

ఈ కేసులో ఆర్టికల్ 226 కు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లను ప్రస్తావించారు కేసు పూర్వపరాలను సమర్పిస్తామన్న పిటీషనర్ తరపు న్యాయవాది. ఇరు వాదనలు విన్న కోర్ట్ తదుపరి విచారణను సోమవారం కు వాయిదా వేసింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు