వరంగల్ నగరానికి ఉగాది నుంచి ప్రతి రోజు మంచి నీరు - పురపాలక శాఖ మంత్రి కెటిఆర్

ఉగాది నుంచి వరంగల్ నగరంలో ప్రతిరోజూ నీటి సరఫరా
 పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు


గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చే ఉగాది నుంచి ప్రతిరోజూ మంచినీటి సరఫరా చేస్తామని పురపాలక శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తారక రామారావు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాచరణ పై జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని మంత్రి  హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా వరంగల్ నగర పరిధిలో తాగునీటి సరఫరాను ప్రతిరోజు ప్రజలకి అందించే

లక్ష్యంగా పని చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఉగాది నుంచి నగర

పరిధిలో తాగునీటిని ప్రతిరోజు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని  ఇందుకు సంబంధించి అవసరమైన మౌలిక వసతులు సమకూర్చే పనులు వేగవంతం చేయాలని సూచించారు. తెలంగాణ  ప్రభుత్వం ఏర్పడి నప్పటినుంచి వరంగల్ నగరంలో మంచినీటి సరఫరాను మెరుగు పరిచేందుకు అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. మిషన్ భగీరథ- అర్బన్

ద్వారా పెద్ద ఎత్తున నగరంలో తాగునీటి సరఫరాకు అవసరమైన మౌలిక వసతుల

కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గతంలో కేవలం 30 ఎం ఎల్ డిల నీటి

సరఫరా నగరానికి ఉంటే, ప్రస్తుతం 168 ఎం ఎల్ డి లకి పెరిగిందని, దీంతో పాటు

నగరంలో గతంలో 1400 కిలోమీటర్ల పైపులైన్లు ఉంటే దీనికి అదనంగా ఇప్పటికే 1400

కిలోమీటర్లు పైప్ లైన్ల నిర్మాణం పూర్తయిందని, దీంతో పాటు మరో 500 కిలోమీటర్ల

పైప్ లైన్ల నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. 

మిషన్ భగీరథ ద్వారా సుమారు వెయ్యి కోట్ల రూపాయలను వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు.



వచ్చే ఉగాది నాటికి దాదాపు ఈ పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. ప్రస్తుతం నగరంలో తాగునీటి సరఫరా బలోపేతం కోసం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా 2048 వరకు వరంగల్ నగర ప్రజల తాగునీటి డిమాండ్ ను తట్టుకునేలా రూపొందించడం జరిగిందని

అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. నగరంలో నీటి సరఫరా వ్యవస్థ బలోపేతానికి అవసరమైన 200 మంది నియామకానికి సంబంధించి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ వారి సహాయంతో వెంటనే రిక్రూట్ చేసుకోవాలని మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. 

వరంగల్ నగరంలో సుమారు లక్షా 70 వేల గృహాలకు నల్లా కనెక్షన్లు ఉన్నాయని మిగిలిన గృహాలకు కూడా సాధ్యమైనంత త్వరగా కలెక్షన్లు ఇచ్చేలా, నల్ల కలెక్షన్లను ఒక రూపాయికి తీసుకునేలా ప్రజలను చైతన్యవంతం చేస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని, నగర ప్రజాప్రతినిధులు ఇందుకు సంబంధించిన బాధ్యత తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న సుమారు 3,700 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం

పురోగతిని కూడా మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సమీక్షించారు. ఇప్పటికే దాదాపు 800

ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, మెజారిటీ ఇండ్లు నిర్మాణాన్ని పూర్తి చేసుకునే

దశలో ఉన్నాయని జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ లు మంత్రులకు తెలియజేశారు.

త్వరలోనే పూర్తయిన 800 ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని చేపడతామని

మంత్రులు తెలిపారు. దీంతో పాటు నగర పరిధిలో జిల్లా కలెక్టరేట్ తో పాటు మోడల్

జూనియర్ కాలేజ్ వంటి మౌలిక వసతుల నిర్మాణాలు పూర్తయ్యాయి, ప్రారంభానికి

సిద్ధంగా ఉన్నాయని, వీటిని త్వరలోనే ప్రజలకి అందుబాటులోకి తీసుకువస్తామని

అన్నారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పట్టణ ప్రగతి

కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వైకుంఠ ధామాల నిర్మాణం, అర్బన్ పార్కులు,

స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం వంటి కార్యక్రమాలను కార్పొరేషన్ పరిధిలోనే

కొనసాగించాలని సూచించారు. ఇప్పటికే పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన

పార్కుల అభివృద్ధి మరియు టాయిలెట్ల నిర్మాణం వంటివి పూర్తయ్యాయని, పట్టణ

ప్రగతి ద్వారా ప్రభుత్వం ప్రతి నెల కార్పొరేషన్ కి 7.33 కోట్ల రూపాయలను

ఇస్తున్నదని, ఇప్పటిదాకా సుమారు 81 కోట్ల రూపాయలను ప్రభుత్వం పట్టణ ప్రగతి

నిధుల ద్వారా అందించిందని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు

సంబంధించి కూడా కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఇప్పటిదాకా 440 కి పైగా

పనులు పూర్తి కావడం లేదా పురోగతిలో ఉన్న విషయాన్ని అధికారులు తెలిపారు. ఈ

సమావేశంలో వరంగల్ నగరంలో చేపట్టిన స్మార్ట్ సిటీ కార్యక్రమాలతో పాటు చారిత్రక

కట్టడాల పరిరక్షణ మరియు నగర పారిశుధ్యం, నగర రోడ్డు నెట్వర్క్ బలోపేతం వంటి

అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. త్వరలోనే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్

లోనూ ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ

మంత్రి కె తారకరామారావు ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు.

మంత్రులు యెర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రబుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఎమ్మెల్సి కడియం శ్రీహరి, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూటి దయాకర్, ఎమ్మెల్యేలు గుండేటి నరేందర్, ఆరూరి రమేశ్ పాల్గొన్నారు.

పుర‌పాల‌క‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర్వింద్ కుమార్, ఆర్థిక‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ రామ‌కృష్ణారావు, జిల్లా క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, ప‌బ్లిక్ హెల్త్ ఇఎన్ సి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు