పశ్చిమ బెంగాల్ లో బిజెపిలో చేరిన 10 మంది తృణమూల్ కాంగ్రేస్ ఎమ్మెల్యేలు

మమతాకు ఎమ్మెల్యేల ఝలక్ - అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు

 


పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రేస్ పార్టీకి భారతీయ జనవతా పార్టి గట్టి షాక్ ఇచ్చింది.  పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన సువేందు అధికారి తనతో పాటుమరో 10 మంది ఎమ్మెల్యేలను వెంటేసుకుని భాజపాలో చేరాడు. శనివారం వీరంతా కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపి లో చేరారు. వీరితో పాటు కాంగ్రేస్,సిపిఎం పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడ బిజెపిలోకి చేరారు.  

మిధాన్ పూర్ లో జరిగిన బారి బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు.

  సువేందు అధికారి  మమతా మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసారు. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టి ఆపరేషన్ ఆకర్ష్ ఉధృతం చేసింది. త్రుణమూల్ కాంగ్రేస్ పార్టి అధినేత్రి ముఖ్యమంత్రి మమతా దీదీకి షాక్ లపై షాక్ లు ఇస్తోంది.  పశ్చిబెంగాల్ లో ఎట్లాగైనా అధికారం లోకి రావాలని బిజెపి ఎత్తుల మీద ఎత్తలు వేస్తూ దీదీకి నిద్రలేకుండా చేస్తోంది.   

 పశ్చిమ బెంగాల్ లో బిజెపి అన్ని అవకాశాలు వెదుక్కుంటూ వ్యూహ రచన చేస్తున్నది. బిజెపి వ్యూహాన్ని చిత్తు చేసేందుకు మమతాకు శక్తి చాలటం లేదు.  ఏకంగా తన పార్టీని వీడి 11 మంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడం ప్రకంపనలు సృష్టించింది. 

ఎమ్మెల్యేల చేరిక సందర్బంగా అమిత్ ష్ మమతా బెనర్జిపై విమర్శలు కురిపించారు.  పశ్చిమ బెంగాల్ ప్రజలు బెజిపి ఓక సారి అవకాశం ఇస్తే సోనార్ బంగ్లా గా చేస్తామన్నారు. కాంగ్రేస్ కు 30 ఏండ్లు, కమ్యునిస్టులకు 27 ఏండ్లు అధికార ఇచ్చిన ప్రజలు బెజెపికి ఓ సారి అధికారం ఇచ్చి చూడండి సోనార్ బంగ్లా గా చేస్తామని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో ప్రజలు పూర్తిగా మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు.  వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టి పశ్చిమ బెంగాల్ లో 200 సీట్లు గెలుచు కుంటుందని అన్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు