హైదరాబాద్ లో క్రైం రేట్ 10 శాతం తగ్గింది --సిపి అంజని కుమార్

 


హైదరాబాద్ నగరంలో 2020 సంవత్సరానికి క్రైం రేట్ 10 శాతానికి తగ్గిందని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజని కుమార్ తెలిపారు. 2019 సంవత్సరంలో 25,187 కేసులు నమోదు కాగా 2020 లో 22,641 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. POSCO కేసులు( చిన్న పిల్లలపై లైంగిక వేధింపు కేసులు) ్ంతక ుముందు సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా 35 శాతం తగ్గాయని చెప్పారు. ఆస్తుల తగాదాలకు సంభందించిన కేసులు 27 శాతం మహిళల పై అత్యాచారానికి సంభందించిన కేసులు 19 శాతం తగ్గాయని తెలిపారు. సిసి కెమెరాలు అమర్చడంలో హైదరాబాద్ నగరం ప్రపంచం లోని టాప్ 500 నగరాలలో 60 వ రాంకులో ఉందని చెప్పారు. ఈ విషయం అంతర్జాతీయంగా జరిగిన సర్వేలో  తేలిందని అన్నారు. దేశంలో ఏ నగరంలో లేని విదంగా హైదరాబాద్ నగరంలో 3,61,000 సిసి కెమెరాలు ఉన్నాయని క్రైం రేట్ తగ్డడంలో నేర పరిశోధన లో సిసి కెమెరాలు ఎంతో తోడ్పడుతున్నాయని చెప్పారు.

గత ఏడాది నేరాలకు సంభందించి 13 మందికి జీవిత  ఖైదు లభించిందని తెలిపారు. ఓ నేరస్తుడికి 23 ఏళ్ళ శిక్ష ఖరారు అయిందని ముగ్గిరికి 20 ఏళ్ళ, 11 మందికి 10 సంవత్సరాలు 26 మందికి 3 సంవత్సరాల శిక్షలు పడేలా పోలీసులు శాఖ సాక్షాధారాలు సేకరించి న్యాయ స్థానాల్లో శికి్షలు పడేలే చేసిందని చెప్పారు. ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్ కింద 367 మంది బాలులను కాపాడని 200 మంది బాలికలను కాపాడామని తెలిపారు. నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో  2019 లో 271 మంది మరణించగా 2020 లో రోడ్డు భద్రతా చర్యల మెరుగు పర్చడం వల్ల మరణాల రేటు 237 కు తగ్గిందని సిపి వివరించారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు