ఖమ్మంలో కెటిఆర్ కు తగిలిన నిరసన సెగ- బిజెపి కార్యకర్తల అరెస్ట్

 ఖమ్మంలో కెటిఆర్ కు తగిలిన నిరసన సెగ - అడ్డుకున్న బిజెపి కార్యకర్తలు

NO LRS.. NO TRS .. GO TRS అంటూ బిజెపి కార్యకర్తల నినాదాలు


పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం ఖమ్మం వచ్చిన మంత్రి కెటిఆర్ కు నిరసన సెగ తగిలింది. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలంటూ ప్లే కార్డులు ధరించిన బిజెపి కార్యకర్తలు మంత్రిని అడ్డుకున్నారు. యన్ ఎస్పీ కెనాల్ పై నిర్మించిన వాక్ వే ట్రాక్ వద్ద NO LRS.. NO TRS .. GO TRS అంటూ బిజెపి కార్యకర్తలు మంత్రిని అడ్డగించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొద్ది సేపు పోలీసులకు బిజెపి కార్యకర్చలకు మద్య తోపు లాటలు జరిగాయి. . బిజెపి కార్యకర్తలను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మంత్రి కెటిఆర్ ఖమ్మం లో ఐటి టవర్ ప్రారభించారు. ఖానాపురం మినీ ట్యాంక్‌బండ్‌ను, ర‌ఘునాథపాలెం మినీ ట్యాంక్‌బండ్‌ను, బ‌ల్లేప‌ల్లిలో వైకుంఠ‌ధామాన్ని ప్రారంభించారు. ఖ‌మ్మం - ఇల్లెందు రోడ్డు అభివృద్ధి, సెంట్ర‌ల్ లైటింగ్ వ్య‌వ‌స్థ‌ను ప్రారంభించారు. ర‌ఘునాథ‌పాలెం - చింత‌గుర్తి బీటీ రోడ్డు వెడ‌ల్పు ప‌నులను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, ప్ర‌శాంత్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు