పవన్ నిరసన దీక్ష ప్రారంభం

రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని పవన్ కళ్యాన్ దీక్ష  


నివిర్ తుఫాన్ కారణంగా పంటలు నష్ట పోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ  సోమవారం జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ దీక్ష ప్రారంభించారు. తన నివాసంలో యన దీక్షకు పూనుకోగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట జన సేన నాయకులు కార్యకర్తలు దీక్ష చేపట్టారు.

నివిర్ తుఫాను తీవ్రతకు పంటలు నష్ట పోయిన ప్రాంతాలలో పవన్ కళ్యాన్ పర్యటించారు.  రైతులకు 35 వేల చొప్పున పంటల నష్ట పరిహారం చెల్లించాలని తక్షణ సహాయంగా 10వేల ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని పన్ కళ్యాన్ డిమాండ్ చేసారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాన్ ప్రభుత్వం ఎదుట కొన్ని డిమాండ్లు ఉంచారు. డిసెంబర్ 6 వ తేది వరకు డిమాండ్లు నెర వేర్చని పక్షంలో నిరసన దీక్ష చేపడతానని పవన్ కళ్యాన్ హెచ్చరించారు. అయితే ప్రభుత్వం నుండి సమాధానం రాక పోకడంతో పవన్ కళ్యాన్ దీక్ష చేపట్టారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు