బండి సంజయ్ విమర్శలతో వార్తల్లోకి వచ్చిన హైదరాబాద్ రోహింగ్యాలు

  • హైదరాబాద్ నగరంలో ఇంతకు రోహింగ్యాలు ఎంత మంది ఉన్నారు ?
  • కేంద్ర  నిఘా వర్గాలు పలు మార్లు హెచ్చరించినా ఎంత మంది ఉన్నారో   పోలీసులు లెక్కతేల్చ లేదా ?
  • నగరంలో 75 వేల వరకు రోహింగ్యాలున్నారన్న  కేంద్ర మంత్రి స్మృతి ఇరాని మాటల్లో ఎంత వరకు వాస్తవం ఉంది?
  • వారికి ఓటు హక్కు కల్పించాలని ఎంఐఎం నేత సిఫార్సు చేసారా  ?


హైదరాబాద్ రోహింగ్యాల విషయం జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా  చర్చ నీయాంశమైంది. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారని సర్జికల్ స్ట్రైక్ చేపిస్తామంటూ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కల కలం రేపాయి.  బండి సంజయ్ వ్యాఖ్యలను  ఆ పార్టి నేతలు సమర్దించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరాని నగరంలో 75 వేల వరకు  అక్రమ చొరబాటు దారులైన రోహింగ్యాలు  ఉన్నారని అన్నారు.  వారికి ఎంఐఎం నేత ఓటు హ్కకు కల్పించాలని సిఫార్సు చేసారని  ఆమె బుధవారం హైదరాబాద్ పర్యటన సందర్బంగా ఆరోపించారు.

 నగరంలో అసలు ఎంత మంది రోహింగ్యాలు ఉంటున్నారో ఇంత వరకు పోలీసులు లెక్క తేల్చలేదు. మయన్మార్  నుండి రోహింగ్యాలు బాంగ్లదేశ్ మీదుగా దేశ వ్యాప్తంగా  అక్రమ వలసలు వచ్చారు. అట్లా  వచ్చిన వారు వేలాదిగా హైదరాబ్ నగరానికి  కూడ వచ్చారు. వారి వలసలన్ని ఒక్క రోజులో జరిగినవి కావు.  2010 మందు నుండి వలసలు జరిగాయి.  రోహింగ్యాల అక్రమ వలసల సమస్య ను  కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించే వరకు తెలంగాణ పోలీసులు సీరియస్ గా  తీసుకోలేదు. 

హైదరాబాద్ లో రోహింగ్యాలు పెద్ద సంఖ్యలో వలస వచ్చి స్థిర పడిపోయారని వారు తప్పుడు ధృవ పత్రాలతో  ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు స్థానిక ధృవీకరణ పత్రాలు  పొందుతున్నారని 2018 లో  అప్పటి బిజెపి  అధ్యక్షులు లక్ష్మణ్  ఆ పార్టి నేతలు  స్వయంగా రాష్ట్ర డిజిపిని కల్సి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. వంద మందికి పైగా రోహింగ్యాలకు ఓ ముస్లిం నాయకుడు తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులు ఇప్పించాడని పోలీసుల విచారణలో కూడ వెల్లడైంది.  ఆధార్ అధికారులు వారికి నోటీసులు జారి చేయగా  అప్పట్లో  ఎంఐఎం నేత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి.

రోహింగ్యాలలో  కొందరు శరణార్దులుగా వచ్చిన వారు కూడ ఉన్నారు.  వారికి ఐక్య రాజ్య సమితి ఇచ్చిన  ఐడి కార్డులు ఉన్నాయి.  అట్లా వచ్చిన వారు  వందల సంఖ్యలో ఉండగా ఏ ధృవీకరణ  పత్రాలు లేకుండా అక్రమంగా సరిహద్దులు దాటి  వచ్చి స్థిర పడి పోయిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. 

అక్రమంగా  వలస వచ్చిన రోహింగ్యాలు ఎక్కువగా  పాత బస్తీ లోనే స్థిర పడి పోయారు. పాత బస్తి పరిధి లోని బహదూర్‌పురా, కంచన్‌బాగ్, చాంద్రాయణగుట్ట  పోలీస్  స్టేషన్ల పరిధిలో రోహింగ్యాలు  ఉంటున్నారు. ఈ ప్రాంతాలన్ని  ఎంఐఎం కంచు కోటలు కాగా వారికి ఎంఐఎం నేతలు డబ్బులు తీసుకుని తప్పుడు ధృవ పత్రాలు ఇస్తున్నారని  బిజపి నేతలు  ొదటి నుండి ఆరోపణలు చేస్తున్నారు.   అక్రమ వలస దారులతో దేశ భద్రతకు ముప్పని  కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారి చేసినా  రాజకీయ పరమైన కారణాలతో  లెక్కలు తేల్చ లేదు. ఇంతకు రోహింగ్యాల పై పోలీసులు చేపట్టిన విచారణ ఎంత వరకు వచ్చిందో ఎంత మంది ఉన్నారో వారికి ఎవరు సహకరించారో  అసలు వారికి సంభందించిన డేటా ఉందా లేదా కూడ తెలియదు. 

ఒక అంచనా ప్రకారం నగరంలో  సుమారు 6 నుండి 7 వేల వరకు రోహింగ్యాలు  ఉండ వచ్చని  హైదరాబాద్  పోలీసులు కరోనా కలకలంప్రారంభమైన ఏప్రిల్ మాసంలో  వెల్లడించారు. డిల్లీ లో  మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారిలోరోహింగ్యాలు ఉన్నారన్న వార్తలపై పోలీసులు సర్వే చేసి  ఈ వివరాలు వెల్లడించారు.   కాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరాని  ఆరోపించినట్లు  హైదరాబాద్లో 75 వేలకు అక్రమ చొరబాటు దారులు ఉన్నారంటే ఇది చాలా తీవ్ర మైన సమస్య అని చెప్వవచ్చు. రాజకీయ పరమైన ఆరోపణలు అనితేలికగా తీసి పారేయడానికి వీలు లేదు.  కేంద్రం మంత్రి సమాచారం లేకుండా  ఆధారం లేకుండా  మాట్లాడక పోవచ్చు. హైదరాబాద్ పోలీసులు  నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంది. అసలు  హైదరాబాద్ నగరంలో రోహింగ్యాల గణాంకాలు తేల్చాల్సి ఉంది.


 

రోహింగ్యాలు హైదరాబాద్ నగరంతో పాటు నల్గొండ, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో కూడ ఉంటూ సెంట్రింగ్ పనులు, ఎలక్ట్రిషియన్ పనులు గృహ నిర్మాణ పనులు చేస్తు బతుకుతున్నారు.  స్థానికంగా ఉండే నాయకులతో పరిచయాలు పెంచుకుని  ఓటరు ఐడి కార్డులు, ఆధార్ కార్డులు,రేషన్ కార్డులు కూడ పొందారనే ఆరోపణలు ఉన్నాయి.

 రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్, బాలపూర్ ప్రాంతాల్లో  వేల సంఖ్యలో  రోహింగ్యాలు స్థిర పడ్డారని  రెండే ళ్లక్రితమే వార్తలు వచ్చాయి.   వీరి వలసలు అగాయా లేదా  లేక స్థానిక నాయకుల సహకారంతో కొనసాగుతున్నాయా అనే విషయాలు నిర్దారణ కావాల్సి ఉంది. 

రోహింగ్యాలలో నేర స్వభావం ఎక్కువ. తమ కు స్థిర మైన  ప్రాంతం లేక పోవడంతో  అక్రమ వలసలతో వివిద ప్రాంతాలలో స్థిర పడ్డారు.  ఆ మధ్య హైదరాబాద్ లో  రోహింగ్యాలు  డ్రగ్స్ సరఫరా చేస్తూ  పోలీసులకు పట్టు పడ్డారు.

నకిలిపాస్ పోర్టులు,  నకిలి ఆధార్ కార్డులతో పలు మార్లు రోహింగ్యాలు పట్టు పడ్డారు. వీరి వేశ భాషలు చూసి గుర్తు పట్టడం చాలా కష్టం. ముస్లీం ల మాదిరిగానే నెత్తిన టోపి మీసాలు, గడ్డాలతో కనిపిస్తూ  ఉర్దూ,హిందీ ధారాళంగా మాట్లాడతారు.  రోహింగ్యాలుగా ఎక్కడా చెప్పరు. బంగ్లాదేశ్ వాసుల మంటారు. లేదా ఉత్తరాధి రాష్ట్రాల పేర్లు చెబుతారు. వారి ధృవీకరణ పత్రాలు చూస్తే తప్ప  వారు రోహింగ్యాలని ఎవరు గుర్తు పట్టలేరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు