కాంగ్రేస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఇక లేరు

  •  కాంగ్రేస్ ఇంట విశాదం...
  • కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన అహ్మద్ పటేల్
  • మొన్న తరుణ్ గగోయ్ నేడు అహ్మద్ పటేల్ ను కబలించిన కరోనా మహమ్మారి
  • కరోనాతో జాగ్రత్త అంటూ అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్ దుఖ్ఖంలోను సందేశం


అహ్మద్ పటేల్ కాంగ్రేస్ పార్టి సీనియర్ మోస్ట్ నేత..పార్టి వ్యూహకర్త  కరోనా తో చికిత్స పొందుతూ మరణించారు. బుధవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచి నట్లు ఆయన కుమారుడు ఫైజల్ పటేల్ ట్వీట్ చేసారు.

మీకు భాదకరమైన విషయం చెప్పాల్సి వచ్చినందుకు చింతిస్తున్నానని.. నా తండ్రి అహ్మద్ పటేల్ కన్ను మూసారని తెలిపారు. నెల రోజుల క్రితం కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన తర్వాత చికిత్స పొందారని ఆయన ఆవయవాలు బాగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దయ చేసి అందరూ కరోనా నిభందనలు పాటించాలని కోరారు. జన సమూహాల లోకి వెళ్లవద్దని  వ్యక్తి గత దూరం పాటిస్తు కరోనాతో జాగ్రత్తగా  ఉండాలంటూ ఫైజల్ పటేల్ తండ్రి చనిపోయిన దుఖ్ఖంలో ఉన్నా కరోనా మహమ్మారి గురించి హెచ్చరిక చేసారు.

అహ్మద్ పటేల్ మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోది, సోనియా గాంధి  సహా పలువురు జాతీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.  ఐదు సార్లు రాజ్యసభ సబ్యులుగా మూడు సార్లు లోక్ సభ సబ్యుడిగా పార్లమెంట్ ఉభయసభల్లో సుదీర్ఘ కాలం పనిచేసారు.  ఇందిరా గాంధి హయాం నుండి రాజీవ్ గాంధి ఆతర్వాత పార్టి అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజకీయ ముఖ్య సలహా దారుగా గత 14 సంతవ్సరాల నుండి కొనసాగుతున్నారు. అహ్మద్ పటేల్ తో  చర్చ లేకుండా ఆయన సూచనలు సలహాలు పాటించకుండా సోనియా గాంధి ఏ నిర్ణయం తీసుకునే వారు కాదని పార్టి వర్గాలు చెబుతుంటాయి.

అహ్మద్ పటేల్ గుజరాజ్ రాష్ట్రంలో 21 అగస్ట్ 1949 లో జన్మించారు. ఆయన తండ్రి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే వారు. అహ్మద్ పటేల్ కాంగ్రేస్ పార్టి అనుబంద ఎన్ఎస్ యుఐ విద్యార్తి సంఘం నేతగా ఆ తర్వాత యూత్ కాంగ్రేస్ నేతగా రాజకీయ జీవితం ప్రారంభించారు. తొలుత ఆయన రాజకీయ ప్రారంభం స్థానిక సంస్థల నండి  మొదలైంది.  స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి ఇందిరా గాంధీ దృష్టిలో పడడడంతో 1977 లో ఆరవ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టి అభ్యర్థిగా టికెట్ ఇవ్వడంతో పోటి చేసి గెలుపొందారు. అహ్మద్ పటేల్ రాజీవ్ గాంధి ప్రధాన మంత్రిగా ఉన్నపుడు పార్లమెంటరి సెక్రెటరీగా పనిచేసారు. సోనియా గాంధి యుపిఏ చైర్ పర్సన్ గా నియమితులు అయిన తర్వాత అహ్మద్ పటేల్ ఆమెకు ముఖ్యసలహా దారుగా పనిచేసారు. ఆయనకు  కాంగ్రేస్ పార్టి  ట్రబుల్ షూటర్ గా పేరుంది. 

అహ్మద్ పటేల్ మరణం కాంగ్రేస్ పార్టీకి తీరని లోటని చెప్పవచ్చు. ఆయన మరణ వార్తతో కాంగ్రేస్ పార్టి అధ్యక్షురాలు  సోనియా గాంధి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. నమ్మకమైన సహోద్యోగిని ఓ మంచి స్నేహితుడిని కోల్పోయానని ఆమె సంతాపం వ్యక్తం చేసారు. అహ్మద్ పటేల్ కు ఉన్నసద్ గుణాలు గుర్తు చేస్తు ఆయన కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేసారు.

ప్రధాని నరేంద్ర మోది

 ‘అహ్మద్‌ పటేల్‌ గారి అకాల మరణం తనను చాలా బాధకు గురిచేసింది. ఆయన చాలాకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్నారు. సమాజానికి సేవ చేశారు. పదునైన వ్యూహకర్తగా, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అహ్మద్‌ పటేల్‌ కుమారుడు ఫైజల్‌తో మాట్లాడాను. తనకు సానుభూతి తెలిపాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోది ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు