దేశంలో జమిలి ఎన్నికలు అనివార్యం - ప్రధాన మంత్రి నరేంద్ర మోది


 జమిలి ఎన్నికలు..ఈ పదం కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల అధినేతలకు గిట్టని పదం.. కాని దేశ ప్రధాన మంత్రి నేరంద్ర మోదీ జమిలి ఎన్నికల విషయం  ప్రస్తావిస్తు మైండ్ సెట్ చేస్తుండటం కొన్ని రాష్ట్రాల ఏకఛత్రాధి పత్యం గల ఫార్టీల అధినేతలకు అసలు మింగుడు పడటం లేదు. 

రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా గుజరాత్ లో గురువారం జరిగిన శాసన వ్యవహారాల ప్రిసీడియం ఆఫీసర్ల సమ్మేళనంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోది జమిలి ఎన్నికల నిర్వహణపై ప్రిసీడింగ్ అధికారులకు దిశా నిర్దేశం చేసారు.

 ప్రధాని మరో మారు జమిలి ఎన్నికల విషయం నొక్కి చెప్పారు. జమిలి ఎన్నికల జరగాల్సిన అవసరం దేశానికి ఎంతో అవసరమని అన్నారు.

దేశంలో పార్ల మెంట్ కు అట్లాగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు జరగటం లేదు.  రాష్ట్రానికో షెడ్యూల్ కొనసాగు తోంది.

వేరే వేరు ఎన్నికలు పదే పదే ఎక్కడజో ఓ చోట జరగడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురు అవుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. జమిలి ఎన్నికలు  - ఒకే దేశం ఒకే ఎన్నికలు  జరగటం వల్ల వ్యయం, సమయం కల్సి వస్తాయని అన్నారు. జమిలి ఎన్నికలపై లోతుగా చర్చ జరగాలన్నారు. ఈ చర్చలను ప్రిసైడింగ్ అధికారులు ముందుకు తీసుకు వెళ్ళాలని అన్నారు.  సామాన్యులకు ప్రయోజనం లేని చట్టాలను తీసుకు రావాలని అవసరం లేని చట్టాలను తొలగించాలని అన్నారు. ప్రజా శ్రేయస్సు  ప్రాధాన్యతగా ప్రధాన చర్చ జరగాలన్నారు. పంచాయతి ఎన్నికల నుండి అసెంబ్లి, పార్లమెంట్ వరకు ఒకే ఓటరు జాబితా తో ఎన్నికలు నిర్వహించే విధానం రావాలని అన్నారు.


ఆందోళన ఎందుకు ?

ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదం వెనక కాశాయ కూటమి పెద్ద మాస్టర్ వ్యూహం  ఉందని  వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నాభిప్రాయాలతో ఉన్నారు.  ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రాంతీయ పార్టీలకు తీరని నష్టమనే అభిప్రాయం వారిలో ఉంది.  2023 ఎన్నికలకు ముందే మద్యలో ఎప్పుడో జమిలి ఎన్నికలు రావచ్చని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే ఊహాగానాలు చేస్తున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా జమిలి ఎన్నికలకు ప్రధాని సిద్ద పడుతున్నట్లే గుజరాత్ లో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగ సారాంశం తెలుపుతోంది. జూన్ లో ప్రధాన మంత్రి జమిలి ఎన్నికల ప్రతిపాదనపై అఖిల పక్ష సమావేశం కూడ నిర్వహించారు. 

ఎంఐఎం పార్టీతో పాటు ఉభయ కమ్యునిస్టు పార్టీలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. టీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, డీఎంకే, టీఎంసీ, ఆర్జేడీ సహా 16 పార్టీలు అఖిల పక్ష సమావేశానికి ముఖం చాటేసాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశంలో పాల్గొన లేదు. ఆయన స్థానంలో ఆయన తనయుడు కెటిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పాల్గొన్నారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు