తెరాస మానిపెస్టోలో ఉన్నవన్ని గతంలో చెప్పినవే - ఒక్కటి కూడ అమలు చేయలేదు

 


తెలంగాణ రాష్ట్ర సమితి జిహెచ్ఎంసి ఎన్నికల సందర్బంగా విడుదల చేసిన ఎన్నికల మానిఫెస్టోలో కొత్త వేవి లేదవి గతంలో 2016 సంవత్సరంలో ఇవన్ని ప్రకటించినవే నని కేంద్ర మంక్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సోమవారం పార్టి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సెలూన్లకు, దోభిఘాట్లకు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ ఇస్తామని గతంలో చెప్పి అమలు చేయలదని అన్నారు. హైదరాబాద్ ను విశ్వ నగరం అంటూనే విశాధ నగరం చేశారని అన్నారు. నగరాన్ని ఇటీవల వరదలు ముంచెత్తడంతో 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. తాగు నీటి గోస తీరుస్తామని గతంలో అనేక సార్లు చెప్పినా తీర్చలేదన్నారు. ఓల్డ్ బస్తి ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు మజ్లీస్ కు,టిఆర్ ఎస్ పార్టీలకు లేవని అన్నారు.ఎంఎం టిఎస్ పనులు 98 శాతం పూర్తి కావచ్చాయని  రాష్ట్ర వాటా ఇంత వరకు ఇవ్వక పోవడం వల్లే పనులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య లేదంటున్నారని కాని నగర ప్రజలు ట్రాఫిక్ సమస్య గురించి చెప్పాలన్నారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు