హద్దులు దాటిన విమర్శలు - నియంత్రణ కోల్పోతున్న నాయకులు

 


గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో  బిజెపి,టిఆర్ఎస్ నాయకుల మద్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది.బిజెపి, టిఆర్ఎస్ మద్య మాటల యుద్ధం చూస్తుంటే ఇరు పార్టీల నేతలు హద్దులు దాటి నియంత్రణ కోల్పోయినట్లు అర్దం అవుతోంది.

 పరుష పదజాలాలతో పాటు, విద్వేష ప్రసంగాలు కూడ వారి ప్రసంగాల్లో చోటు చేసు కుంటున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐంఎం పార్టీని టార్గెట్ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.  పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన అనంతరం పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్నారు. రోహింగ్యాలు, పాకిస్తాన్‌ వాసులను తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు.

‘‘ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి మేయర్ పీఠం దక్కించుకుంటే.. బిడ్డా.. నీ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. సర్జికల్ స్ట్రైక్ అంటే ఎవర్నో చంపేందుకు కాదు.. అక్రమంగా ఉంటున్న వారి ఓట్లతో గెలుస్తున్నందున వారిని వెళ్లగొట్టాలి. రోహింగ్యాలను, పాకిస్థానీలను తరిమి తరిమి కొడతాం’’ అని అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి హెచ్చరించారు.

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఆర్ తప్పు పట్టారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  సమర్దిస్తారా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ ను  తల్లడింప చేసి నాలుగు ఓట్ల కోసం పచ్చగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టాలని బిజెపి నాయకులు చూస్తున్నారని విమర్శించారు.  బండి సంజయ్ మతి స్థిమితం కోల్పోయారని కెటిఆర్ ట్వీట్ చేసారు.

నగర ఎన్నికల ప్రచారంలో ఎవరి వ్యూహం మేరకు వారు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తు మైలేజి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టిఆర్ఎస్ బిజెపిని మత విద్వేశాలు రెచ్చగొట్టే పార్టీగా చిత్రీకరిస్తుంటే బిజెపి నేతలు టిఆర్ఎస్ ను ఎంఐఎం రెండు ఒకే తాను ముక్కలని విమర్శలు చేస్తున్నాయి. తెరాసకు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లే నని బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నారు.

అంతకు ముందు ప్రచారంలో ఇది అహ్మదాబాద్ కాదు హైదరాబాద్ అంటూ కెటిఆర్ బిజెపి నేతలపై ధ్వజ మెత్తారు. బిజెపికి ఓటు వేస్తే గుజరాతీలకు గులాం గిరి చేయాల్సి వస్తుందన్నారు.  

హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉంటే కేంద్ర హోం మంత్రి ఏం చేస్తున్నారంటూ ఎంఐఎం నేత అసదుద్దీన్ పాత బస్తి ప్రచారంలో ప్రశ్నించినందుకు బదులుగా బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ వ్యాఖ్యలు చేసారు. 

ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ఇంకా ఎంతగా రెచ్చి పోయిన ప్రంగాలు విన వల్సి వస్తుందో చూడాలి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు