జిహెచ్ఎంసి ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రేస్

 

వరద సాయం 50 వేలు -ఇండ్ల నిర్మాణాలకు 8 లక్షలు


జిహెచ్ఎంసి ఎ్ననికల మానిఫెస్టోను గాంగ్రేస్ పార్టి విడుదల చేసింది.  వరదల్లో నష్ట పోయిన నగర వాసులకు ర5 0 వేల చొప్పున పరిహారం అంద చేస్తామని మానిపెస్టోలో హామి ఇచ్చారు.

మంగళవారం గాంధి భవన్ లో పార్టి రాష్ట్ర ఇన్ చార్జి ఠాకూర్, అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, సబబీర్ అలి, రేవంత్ రెడ్డి, గీతారెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్ తదితరులు మానిఫెస్టో వివరాలు వెల్లడించారు.  విద్యార్థులు, దివ్ాయంగులు, మహిళలు, వృద్ధులకు ఎంఎంటిఎస్, మెట్రోలో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. అర్హత కలిగిన వారందరికి ఉచితంగా రెండుడ గదుల ఇండ్లు కట్టిస్తామన్నారు. 80 గజాల లోపు స్థలం ఇండ్లకు పూర్తిగా ఆస్తి పన్ను మాఫి చేస్తామన్నారు. ఇంటి స్థలం ఉండి ఇండ్లుకట్టుకునే వారికి రూ 8 లక్షలతో ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. ఒక గది ఉన్న వారికి అదనపు గది నిర్మాణం కోసం రూ 4 లక్షలు ఇస్తామన్నారు. కేబుల్టివి ఆపరేటర్లకు పోల్ ఫీజు మాఫి చేస్తామన్నారు. ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామన్నారు. మురికి వాడల అభివృద్ధికి ప్రత్యేక అథారిటి ఏర్పాటు చేస్తామన్నారు. వీధి వ్యాపారులకు ఉచితంగా ఆరోగ్య భీమా కల్పిస్తామన్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు