వీధిన పడిన కుటుంబాన్ని ఆదుకున్న సిఎం కెసిఆర్ సతీమణి శోభమ్మ


 కరీంనగర్ జిల్లాలో అనారోగ్యంతో చనిపోయిన కటంకం తిరుపతి కుటుంబాన్ని సిఎం కెసిఆర్  సతీమణి శోబమ్మ ఆదుకున్నారు. తిరుపతి ఇటీవల ఆనారోగ్యంతో చనిపోగా భార్య ఇద్దరు పిల్లలు నిలవ నీడ లేక వీధిన పడ్డారంటూ మీడియాలో వార్తలు చూసి శోభమ్మ చలించారు.  ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ  లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి  చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ఇచ్చి  పంపించారు.  తిరుపతి చనిపోగా ఆయన ఇళ్లు కూడ ఇటీవల భారి  వర్షాలు కురిసిన సమయంలో కూలి పోయింది. దాంతో వారు మున్నూరు కాపు ఙవనం లో తలదాచుకుంటున్నారు. 

ఆదివారం ఎమ్మెల్యే  రవిశంకర్ రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామాన్ని సందర్శించి తిరుపతి కుటుంబానికి ఆర్థిక సహాయం అంద చేశారు. శోభమ్మ  ప్రకటించిన  లక్ష రూపాయల నగదుకు తోడుగా మరో రెండు లక్షలు స్థానిక నాయకులు, దాతల నుండి సేకరించి  తిరుపతి  కుటుంబానికి అంద చేసారు. వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని  పిల్లలను గురుకుల పాఠశాలలో  చేర్పించి చదివి పిస్తామని ఎమ్మెల్యే హామి ఇచ్చారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు