సిఐ, కానిస్టేబుల్ కు బెయిల్ మంజూరు

 


పోలీసుల వేధింపులు భరించ లేక ఈ నెల 3 వ తేదీన గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న షేక్ అబ్దుల్ సలాం కేసులో సిఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ లకు నంద్యాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం ఆయన బార్య నూర్జహాన్ (38), కుమారుడు దాదా ఖలందర్ (10), కూతురు సల్మా (14) ఈ నెల 3 వ తేదీన గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. చనిపోయే ముందు పోలీసుల వేధింపుల వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు  సెల్ఫీ తీసుకున్నారు.  ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాంతో సిఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో బెటాలియన్స్‌ ఐజీ శంకబ్రత బాగ్జి, గుంటూరు అడిషనల్‌ ఎస్పీ హఫీజ్‌లను   విచారణాధికారులుగా నియమిస్తూ డిజిపి గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులిచ్చారు.  ఐజీ శంకబ్రత బాగ్చి, గుంటూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌లతో ప్రాథమిక విచారణ చేయించింది. వీరు సేకరించిన సాక్ష్యాల ఆధారంగా సీఐ, హెచ్‌సీలను సస్పెండ్ చేసి ఆదివారం అరెస్టు చేశారు. నంద్యాల ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఏడు రోజుల రిమాండ్‌ విధించింది. అయితే వీరిద్దరూ బెయిల్ కోసం పోలీసులకు దరకాస్తు చేసుకోవడంతో నంద్యాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

చేయని దొంగతనం నేరం మోపి పోలీసులు వేధిస్తున్నారని అబ్దుల్ సలాం  తన కుటుంబ సబ్యులతో కల్సి ఏడుస్తూ చెప్పిన విషయాలకు సంభందించిన వీడియో బయటికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు