ప్రగతి భవన్ లో కరోనా పరేశాన్ ?!


చిరంజీవికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావడంతో తెలంగాణ సిఎం కెసిఆర్ తో పాటు మంత్రులు  అధికారులు, సిబ్బందిలో ఆందోళన నెలకొంది. అక్కినేని నాగార్జునతో పాటు చిరంజీవి సిఎం కెసిఆర్ ను ప్రగతి భవన్ లో కల్సి వరద బాదితులకు తమ వంతు విరాళాల చెక్కులు అంద చేసారు. ఈ సందర్బంగా వారిద్దరూ సిఎం కార్యాలయంలో చాలా సేపు గడిపారు. అన్ని హంగులతో ప్రపంచ స్థాయి సినిమా సిటి నిర్మాణం గురించి సిఎం వారితో చర్చించారు.  ప్రగతి భవన్ లో ఆ సమయంలో సిఎంతో పాటు అదికారులు సిబ్బంది కూడ ఉ్ననారు. ఇప్పుడు వీరంతా హోం క్వారెంటైను వెళ్లాల్సిందే. సిఎం కెసిఆర్ కు కూడ హోం క్వారెంటైన్ అబ్జర్వేషన్ తప్పేట్లు లేదు.

ఎందుకంటే చిరంజీవే స్వయంగా తనకు కోవిడా పాజిటివ్ వచ్చిందని ఎలాంటి లక్షణాలు లేవని గత 4-5 రోజులుగా తనను కల్సిన వారంతా టెస్టు చేయుంచుకోవాలని ట్వీట్ చేశారు. సిఎం కెసిఆర్ తో పాటు రోడ్లు భవణాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,  ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, శేషాద్రి తదితరులతో పాటు సిఎం పిఆర్వోలు ఉన్నారు. ఇప్పుడు వీరంతా విధిగా కోవిడ్ టెస్టులు చేయించుకునే పనిలో పడ్డారు.
ప్రగతి భవన్ లో ఇది వరకు ఓ సారి కరోనా కల కలం రేపింది. సెక్యూరిటి సిబ్బందిలో చాలా మందికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రగతి భవన్ మొత్తం సానిటేషన్ చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు