జిల్ బైడెన్ - పంతులమ్మ నుండి ఫస్ట్ లేడి వరకు

డాక్జర్ జిల్  బైడెన్ మొన్నటి వరకు పాఠాలు చెప్పిన సాధారణ పంతులమ్మ. ఇప్పుడు  అమెరికా ఫస్ట్ లేడి . అమెరికా అధ్యక్షులుగా అధికార పీఠం ఎక్క బోతున్న జో బైడెన్ సహధర్మ చారి.  


దేశ వ్యాప్తంగా అందరికి తమను తాము విశ్వసించుకునేందుకు విశ్వాసం  కలుగ చేసిన మీ అభిమాన విద్యావేత్త జిల్ బైడెన్.. ఈ దేశ  ప్రథమ మహిళ అంటూ జో బైడెన్ విజయం సాధించిన అనంతరం   దేశ ప్రజల నుద్దేశించి  చేసిన ప్రసంగంలో తన సహచరిని గొప్పగా పరిచయం చేసాడు.  

జో బైడెన్ తో వైట్ హౌజ్ లో  ప్రథమ మహిళగా అడుగు పెట్టబోతున్న జిల్ బైడెన్  దశాబ్దాల కాలంగా  ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు.  బాచిలర్స్ డిగ్రీ తో పాటు  రెండు మాస్టర్ డిగ్రీలు కలిగిన 69 ఏళ్ళ జిల్ బైడెన్ 2007 లో డెలావర్ యూనివర్శిటి నుండి విద్యాభోదనలో డాక్టరేట్ పొందారు.  ఇంగ్లీషు పాఠాల బోదకురాలిగా జిల్ బైడెన్ అనేక పాఠశాలల్లో పనిచేశారు. 

జిల్ బైడెన్  1951 లో న్యూజెర్సీలో జన్మించారు.  జోను పెండ్లి చేసుకునేందుకు ముందు తానుచదువుకున్న కాలేజీలో ఫుట్ బాల్ ప్లేయర్ అయిన  బిల్ స్టీవెన్సన్ ను  వివాహం చేసుకుంది. 1872 లో జో బైడెన్ బార్య ఏడాది వయస్సున్న కూతురు కారు ఆక్సిడెంట్లో  చనిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కుమారులు  బతికి బయట పడ్డారు. అనంతరం జో బైడెన్  కు జిల్ తో పరిచయం ఏర్పడి  19977 లో  న్యూయార్కులో  ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఆదు సార్లు ప్రపోజ్ చేసిన అనంతరం కాని  జిల్ బైడెన్ అంగీకరించ లేదు.  వీరికి 1981 లో  కూతురు ఆశ్లీ జన్మించింది. జో బైడెన్ మొదటి భార్య కుమారుడు  కుమారుడు బూ బైడెన్ 2015 లో కాన్సర్ వ్యాధిన పడి చని పోయాడు. 

జో బైడెన్ తన కుటుంబానికి ఎంత అండగా నిలిచి కష్ట పడ్డారో ఆమెరికా ప్రజలను కూడ అట్లాగే అండగా నిలిచి ఆదుకుంటారని ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తారంటూ జిల్ బైడెన్ తన భర్త ఎన్నికల ప్రచారంలో   ఆయనకు తోడుగా ప్రచారం చేసింది. జో బైడెన్ ప్రచార కార్యక్రమాలు స్వయంగా పర్య వేక్షించడంతో పాటు నిధులసమీకరణలో కూడ కీలక పాత్ర పోషించింది.

జిల్ బైడెన్  2009 నుండి 2017 వరకు సెకండ్  ఫస్ట్ లేడీగా  జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్ గా  ఉన్నసమయంలో  కొనసాగారు. 


 "How did you get this number?"

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు