జై చిరంజీవా ! కరోనా సోకని వీరా ! చిరంజీవికి కోవిడ్ నెగెటివ్ - కిట్ లో లోపంతో తప్పుగా నిర్దారణ

 అదరగొట్టేసావు కదయ్యా చిరంజీవా !


మెగాస్టార్ కు కోవిడ్ పాజిట్ అంతా ఉత్తిదే అని నిర్జారణ అయింది. తన కోసం వాడిన  టెస్టు కిట్ లో లోపం ఉందని  ఫాల్టీ ఆర్టీ పీసీఆర్‌ కిట్‌ వల్ల తనకు పొరపాటున కోవిడ్‌-19 నిర్ధారణ అయిందని చిరంజీవి స్వయంగా ట్వీట్ చేసారు. ఇక చిరంజీవితో క్లోజ్ కాంటాక్టులో ఉన్నవారంతా నిశ్చింతగా ఉండవచ్చు. ఎవరైనా హోం క్వారెంటైన్ లో ఉన్నా  బే ఫికర్ గా ఉండవచ్చు. ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుండంతో చిరంజీవికి ఆదివారం (నవంబర్ 10)  కోవిడ్ టెస్టు నిర్వహించారు. పాజిటివ్ గా నిర్దారణ జరగడంతో చిరంజీవి తనకు కోవిడ్ పాజిటివ్ అని తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని హోం క్వారెంటైన్ లో ఉండాలని ట్వీట్ చేయడంతో అటు సినిమా రంగంలో ఇటు బయటి రంగంలో అతన్ని కల్సిన వారికి ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ ప్రకంపనలు సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ కు చేరాయి. ఎందుకంటే సరిగ్గా 24 గంటలకు ముందే చిరంజీవి సిఎం కెసిఆర్ ను కలిసారు. ఆసమయంలో అక్కినేని నాగార్జున కూడ ఉన్నారు.  మంత్రులు అధికారులు ప్రగతి భవన్ సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. 

చిరంజీవి ట్వీట్ తో అందరిలో ఆందోళన మొదలైంది. టెస్టులు చేయించుకుని హోం క్వారెంటైన్ కు వెళ్లారు. సిఎం కెసిఆర్ ఆయన సహచర మంత్రులు టెస్టులు చేయించు కున్నారా లేదా అనే విషయాలు మాత్రం తెలియదు. ఎవరికైనా ప్రాణాలపై తీపి ఉంటుంది. చిరంజీవితో కల్సిన వారంత ఎంతగా ఆందోళన చెందారో ఏం చేశారో వారు స్వయంగా చెబితే కాని వారి మాటల్లో వింటే కాని మనకు అర్దం కాదు. 

ఇక చిరంజీవిని ఏ వైరస్ సోకలేదు కాబట్టి అందరూ బేఫికర్ గా ఉండవచ్చు. కాని మూతికి మాస్కులు లేకుండా తిరగకండి.

ఎందుకంటే ప్రగతి భవన్లో చిరంజీవి, నాగార్జున సిఎం కెసిఆర్ ను కల్సిన సమయంలో ఎవరూ కోవిడ్ నిభందనలు పాటించ లేదు. స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులు కూడ మాస్కులు ధరించ లేదు. చిరంజీవి , నాగార్జున కూడ మాస్కులు ధరించలేదు.  మాస్కులు ధరించాలని సూక్తులు చెప్పిన వారే ధరించక పోవడం ఓ తప్పుడు సంకేతం. ఇవన్ని పక్కకు పెడితే అసలు చిరంజీవికి  టెస్టు జరిగిన పిసిఆర్ కిట్ ఫాల్టిగా తేలడం చూస్తుంటే  ఇక సామాన్యులు పాపం ఈ టెస్టుల విషయంలో ఎంతగా మోస పోతున్నారో  అర్దం చేసుకోవచ్చు.

”కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కన్ఫ్యూజ్ చేసి.. నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం టెస్టులో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేశాను. రెండు రోజులైనా ఎక్కడా ఎలాంటి లక్షణాలు లేకపోయేసరికి, నాకే అనుమానం వచ్చి, అపోలో డాక్టర్లను అప్రోచ్ అయ్యాను. వాళ్లు అక్కడ సీటీ స్కాన్ తీసి చెస్ట్‌లో ఎలాంటి ట్రేస్స్ లేవని నిర్ధారణకు వచ్చారు. అక్కడ రిజల్ట్ నెగటివ్ వచ్చాక, మరోసారి, మరో చోట నివృత్తి చేసుకుందామని నేను Tenet Labలో మూడు రకాల కిట్స్‌తో టెస్ట్ కూడా చేయించాను. అక్కడా నెగటివ్ వచ్చింది. ఫైనల్‌గా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చిన చోట కూడా RT-PCR టెస్ట్ చేయించాను. అక్కడ కూడా నెగటివ్ వచ్చింది. ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్ట్ faulty కిట్ వల్ల వచ్చిందని డాక్టర్స్ నిర్ధారణకు వచ్చారు. ఈ సమయంలో మీరందరూ నాపై చూపించిన అభిమానానికి, చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు