బాణాసంచ అమ్మడం కాల్చడం నిషేధం- వరంగల్ పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్


 బాణసంచా అమ్మడం మరియు వినియోగించడం నిషేధం

వరంగల్ పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్

*వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా అమ్మకాలు జరపడంతో పాటు వాటిని వినియోగించడం (కాల్చడం)పై నిషేదించడం జరిగిందని వరంగల

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడం ద్వారా వాయు కాలుష్యంతో పాటు కరోనా బారీన పడిన వారి ఆరోగ్యం మరింత క్లిష్టమయ్యే ప్రమాద దృష్యా రాష్ట్రంలో బాణసంచా ఆమ్మకాలు మరియు కాల్చడంపై నిషేధాన్ని విధిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం హైకోర్టు నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో బాణసంచాకు సంబంధించి ఎలాంటి అమ్మకాలతో పాటు వాటి కాల్చడంపై తక్షణమే నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు, వ్యాపారస్తులు, సంస్థలు దీపావళి బాణసంచాను అమ్మకాలు జరపడంగాని లేదా వాటిని వినియోగించడం (కాల్చడం) చేయడంపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో నిషేధం అమలులో వుంటుందని. ఈ ఉత్తర్వులను ఎవరైన అతిక్రమించిన వారి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ఈ నిషేధాన్ని అమలు పర్చడం కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక పోలీస్ విభాగాలను ఏర్పాటు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు