జో బీడెన్ గెలుపు కోసం బరాక్ ఓబామా ఫోన్ కాంపెయిన్ - అశ్చర్య పోయిన వోటర్లుబరాక్ ఓబామా ...ప్రపంచ వ్యాప్తంగా  ఈ పేరు తెలియని వారు ఉండరు.  రెండు సార్లు అగ్ర రాజ్యం అమెరికా  ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి అయిన జో బిడెన్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో దిగారు.  ఫోన్ బాంకింగ్  పేరుతో  అందరికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఆశ్చర్య పరుస్తున్నారు.  స్వయంగా  పోన్ కాలు చేసి హలో నేను ఓబామా మాట్లాడుతున్నాననే  గొంతు వినే సరకి నిజమా అంటూ  విస్తుపోతున్నారు. యెలిసా అనే మబిళ కూడ బరాక్ ఓబామా ఫోన్ కాల్ ఎత్తి  షాక్ అయింది. బరాక్ ఓబామా ఏంటి నాకు ఫోన్ చేయడం ఏంటని ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని మరి మాట్లాడింది. మీరు ఫోన్ చేయడం నాకు సంతోషంలో గుండె పోటు వచ్చినంత పని  అయిందని  యెలీసా పేర్కొంది. తన 8 నెలల బుడతడు ఫన్ సంభాషణను అడ్డుకుంటూ డిస్టర్బ్ చేస్తున్న విషయం యోబామా గమనించి కొదది సేపు ఆ బుడతడి గురించి ఆరా  తీసారు. తనకు ఏ పోన్ కాల్ వచ్చిన మాట్లాడేసమయంలో చన కుమారుడు జాక్సన్  ఇట్లాగే అడ్డు పడుతూ ఉంటాడని యోలిసా  ోబామాకు వివరించింది.  అయితే ఆ బుడతడితో యిప్పుడు ఈ వయస్సులో  మాట్లాడ లేనని పెద్ద అయిన తర్వాత మాట్లాడతానని చెప్పి ఓబామా ఎన్నికల విషయం ప్రస్తావించి బో బీడెన్  కు వోటు వేయాలని కోరారు. ఓబామా ఎన్నికల ప్రచారం ఇట్లా  జో బీడెన్ కు మద్దతుగా కొనసాగడం వల్ల బీడెన్ కు అవకాశాలు బాగా కల్సి వచ్చాయి. ఇది ఓరకంగా రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్ కు సంకటంగానే మారిందని చెప్పవచ్చు


 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు