అమెరికాలో గెలిచే అద్యక్షులెవరో రష్యా జూ జంతువులు తేల్చేసాయి

 రెండు పులులు ఓ ఎలుగుబంటి గెలుపెవరిదో నిర్ణయించాట 

జో బిడెన్ గెలుపే ఖాయమన్నాయట


అధ్యక్ష పదవి కోసం హోరా హోరీగా పోటి కొనసాగుతున్న అమెరికాలో ఇంతకూ ఎవరు గెలుస్తారనే ఆసక్తి  ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.  రిపబ్లిక్  అభ్యర్థి అయిన సిట్టింగ్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ గెలుపు ఓటములపై  రక రకాల సెంటిమెంట్లతో  భవిష్య వాణి తెల్సు కుంటున్నారు. చాలా దేశాల్లో ఇలాంటి  భవిష్య వాణి  తెల్సుకునేందుకు రక రకాల సెంటిమెంట్లుపాటిస్తారు. రష్యాలో కూడ ఓ జూలో  జంతువుల ద్వారా భవిష్యవాణి తెల్సుకునే  సెంటిమెంట్ ఉంది.  అమెరికాలో  డెమోక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ గెలుస్తారా లేక ట్రంప్ గెలుస్తారా  అని మూడు జంతువులకు ఓ పరీక్ష పెట్టి  అంచనాకు వచ్చారు. రష్యాలోని  రొయెవ్  రుచే జూలో   రెండు పులులు ఓ ఎలుగుబంటి కి  నిర్వహించిన పరీక్షలో జో బిడెన్ గెలుస్తాడని జంతువులు  నిర్ణయించాయట.  ట్రంప్, బిడెన్  ల చిత్రాలను  పుచ్చకాయలపై  అంటించి వాటిని పులుల ఎదురుగుగా ఉంచారట.  బార్టెక్ అనే పులి జో బిడెన్ చిత్రం ఉన్న పుచ్చకాయను తీసుకు వెళ్లి తినేసిందట. అట్లాగే  ఖాన్ అనే వైట్ బెంగాల్ టైగర్‌ ఎదుట కూడ రెండు పుచ్చకాయలు ఉంచగా జోడెన్ ముఖచిత్ర కలిగిన పుచ్చకాయను బంతిలా దొర్లించుకుంటూ తీసుకు వెళ్లి  ఆడుకుంటూ హాయిగా  తినేసిందట.  బుయాన్  అనే ఎలుగు బంటి ఎదుట కూడ రెండు పుచ్చకాయలు ఉంచగా జో బిడెన్ పుచ్చకాయను ఎంచుకుని తినేసిందట. దాంతో మూడు జంతవులు ఒకే అంచనా వేసాయని జో బిడెన్  గెలుపు ఖాయమని భవిష్యవాణి తేల్చిందని  మీడియాలో కూడ ఈ ఫన్ని వార్తలు వచ్చాయి.. పుచ్చకాయలకు అంటించిన ముఖ చిత్రాలు జంతువులకు  కనిపించకుండా  వెనక వైపు  ఉండేలా ఏర్పాటు చేసినా వాటిని ఎంచుకుని మరి తినేసాయని నిర్వాహకులు తెలిపారు. గతంలో కూడ అనేక ఎన్నికల సందర్భాల్లో  జంతువులకు ఇలాంటి ఫన్ని  ఈవెంట్స్  నిర్వహించడం ద్వారా ఫలితాలు చూసి ఓ నిర్ణయానికి వచ్చిన  సందర్భలు ఉన్నాయట. ఇండియాలో  అయితే ఇలాంటి  సెంటమెంట్లతో అంచనాలువేయడం చాలా ఎక్కువ.  పాశ్చాత్య దేశాలలో కూడ ఇలాంటి  సెంటిమెంట్ల రోగం ఉండడం అశ్యర్యమే మరి.  ఫన్ని కోసం అయినా సెంటిమెంట్ సెంటి  మెంటే అవుతుంది కాని దానికి ఎలాంటి  శాస్త్రీయత ఉండదు అదో మూఢత్వంగానే చెప్పవచ్చు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు