అర్నాబ్ అరెస్ట్ - మండిపడిన అమిత్ షా


రిపబ్లిక్ టివి ఎడిటర్..అర్నాబ్ గోస్వామి అరెస్ట్ పై కేంద్ర హోం మంత్రి  అమిత్ షా  తీవ్రంగా మండిపడ్డారు.  బిజెపి జాతీయ అధ్యక్షులు జెపినడ్డా కేంద్ర మంత్రి జావడేకర్ స్మృతి ఇరాని తదితరులు ఖండించారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అర్నాబ్ అరెస్ట్ ఎమర్జెన్సి రోజులు తలపిస్తున్నాయని  అమిత్ షా ట్వీట్ చేసారు. కాంగ్రేస్ మిత్ర పక్షాలు కల్సి  దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసాయని  విమర్శించారు. అర్నాబ్ ను అరెస్టు చేయడం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అన్నారు. అర్నబ్ అరెస్ట్ విషయంలో వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగ జేయడమే కాక  ప్రజాస్వామ్యంలో నాలుగో  స్థంభం అయిన  ఫోర్ట్ ఎస్టేట్ పై దాడి చేయడమే నని పేర్కొన్నారు. 

 అర్నబ్ అరెస్ట్ పై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని  ట్వీట్టర్ లో ఖండించారు. అర్నబ్ అరెస్ట్  ను ఖండించనివారంతా ఫాసిజానికి మద్దతు ఇస్తున్నట్లే నని అన్నారు.  మీకు అర్నబ్ గోస్వామి నచ్చక పోవచ్చు  మీరు అర్నబ్ ను ఒప్పు కోక పోయినంత మాత్రాన  అణిచి  వేతకు గూరైన సందర్భంలో మౌనం గా ఉంటే అరెస్టుకు మద్దతు ఇచ్చినట్లు అవుతుందని  రేపు మీ వంతు అయితే మీ కోసం ఎవరు ప్రశ్నిస్తారంటూ  స్మృతి ఇరాని ట్వీటర్ లో ప్రశ్నింారు.

అర్నాబ్ కు చుక్కలు చూపిస్తున్న ముంబై పోలీసులు 

రిపబ్లిక్ టివి  ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి  ముంబై పోలీసులు గత కొన్ని రోజులుగా చుక్కలు చూపిస్తున్నారు. బాలు వుడ్ నటుడు సుశాంత్ సిం్గ ఆత్మహత్య కేసు అనంతరం అరానాబ్ గోస్వామికి ముంబై పోలుసులకు వార్ మొదలైంది. అర్నాబ్ తన దైన పద్దతిలో ముంబై పోలీసులపై అనేక ప్రసారాల్లో అరిచారు. అయితే పోలీసులు కూడ అర్నాబ్ గోస్వామిపై అదును కోసం  ఎదురు చూసి  టిఆర్ పి  విషయంలో  ఫ్రాడ్ చేశారంటూ  కేసులు నమోదు చేశారు.  ఇందుకు సంభందించిన వారికి నోటీసులు జారి చేసి విచారించారు. ఈ కేసులో అర్నాబ్  ను కూడ విచారించాల్సి  ఉంది కాని ఇంతలోనే 2018 లో నమోదైన ఓ కేసు పోలీసులకు అర్నాబ్ ను అరెస్ట్ చేసేందుకు ఆయుధంగా లభించింది.  ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, అతడి తల్లికి  అర్నబ్ గోస్వామి డబ్బులు బాకి పడ్డాడు. అర్నాబ్ తో పాటు మరో రెండ సంస్థలు కూడ వారికి డబ్బులు బాకి పడ్డాయి. డబ్బులు రాక పోవడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. తమకు ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో  ఎవరెవరు ఎగ్గొట్టారో వారి పేర్లతో సహా సూసైడ్ నోట్ రాసారు. అందులో అర్నాబ్ గోస్వామి పేరు కూడ ఉంది.  తన భర్త అన్వయ్ నాయక్ అత్త ఇద్దరూ ఆత్మహత్యచేసుకునేలా  అర్నాబ్ గోస్వామి ప్రేరేపించారని  అన్వయ్ నాయక్ భార్య అక్షిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్షిత ఫిర్యాదు మేరకు అర్నాబ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.  ఆ కేసులోనే పోలీసులు అర్నాబ్ ను అరెస్టు చేసారు.

అర్నాబ్ ను  అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన  ఇంటికి వెళ్లిన సమయంలో తలుపులు తీయకుండా ప్రతిఘటించాడని సమాారం. తనపై కావాలిన మహారాష్ట్ర పోలీసులు తప్పుడు కేసుులపెట్టి ఇబ్బంది పెడుతున్నారని  అర్నాబ్  విమర్శించారు.

అయితే శివ సేన ఎమ్మెల్యేలు మాత్రం అర్నాబ్ అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతందని ఇందులో అధికార దుర్వినియోగం ఏమాత్రం లేదని అన్నారు. కేేంద్ర మంత్రులు తమ  విమర్శలు వెనక్కి తీసుకోవాలని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు