లాలూను విఐపి బంగ్లా నుండి సాధారాణ వార్డుకు తరలించిన జైళు అధికారులు


ఫోన్ కాల్ తెచ్చిన తంటా - విఐపి బంగ్లా నుండి సాధారాణ పేయింగ్ వార్డుకు లాలూ




స్పీకర్ ఎన్నికల కోసం బీహార్ మాజి ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్   ఓ ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడిన  నిషయంవెలుగు చూడడంతో ఆతన్ని విఐపి బంగ్లా నుండి తిరిగి సాధారాణ వార్డుకు తరలించారు. లాలు ప్రస్తుతం రాంచీలోని  రాజేంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్సు) డైరెక్టరు బంగళాలో  ఉండి చికిత్స పొందుతున్నాడు.  పశుగ్రాసం కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న లాలూకు ఆరోగ్య  సమస్యలు తలెత్తడంతో  అతన్ని ఆసుపత్రిలో  పేయింగ్ వార్డులో చేర్ిపంచారు. అయితే లాలూకు  సహాయకులుగా ఉన్న నలుగురిలో ముగ్గిరికి కరోనా సోకడంతో ఆగ్స్ట్ మొదటి  వారంలో అతన్ని  రిమ్స్ డైరెక్టర్  బంగ్లాకు తరలించి అక్కడే విఐపి ట్రీట్  మెంట్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఆయన పార్టి ఎమ్మెల్యేలతో మొబైల్ ఫోన్లో  మాట్లాడారని ఆరోపణలు రావడంతో తిరిగి సాధారణ వార్డుకు తరలించారు.  ఫోన్ కాల్ ఉదంతంపై జార్ఖండ్ సర్కారు విచారణకు ఆదేశించింది. ఎన్నికైన బీహార్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు లాలూ యత్నించారని బీజేపీ నేత సుశీల్ మోదీ ఆరోపించారు. ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్‌పై బీజేపీ ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశుగ్రాసం కుంభకోణం కేసులో దోషిగా తేలడంతో లాలూను 2017 డిసెంబరు 23 న జైలుకు తరలించారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు