మతవిద్వేషాలు రెచ్చగొడితే ఎందుకు అరెస్టు చేయడం లేదు - బండి సంజయ్

 


భాగ్య నగరంలో  మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న వారిపై పక్కా గా సమాచారం ఉంటే వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ భారతీయ జనతా పార్టి అధ్యక్షులు బండి సంజయ్ ముఖ్యమంత్కి కెసిఆర్ ను  ప్రశ్నించారు. ఓట్ల వేసేందుకు సామాన్యులు ఎవరూ రాకుండా చేసేందుకు ఓ పథకం మేరకు సిఎం కుట్ర చేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని బండి సంజయ్ విమర్శించాడు. పటాన్ చెరువులో  శుక్రవారం పార్టి అభ్యర్థుల గెలుపు కోసం జరిగిన రోడ్ షోలో  బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసుల విధానాలు కూడ సరిగా లేవని సిఎం సిఎం కెసిఆర్ ఏది రాసిస్తే పోలీసుల అధికారులు కూడ అదే చదువుతున్నారని  మండి పడ్డారు. పాతబస్తీలో ఉన్న  రోహింగ్యాలను  నగరం నుండి పంపించాలని లేదంటే బిజెపి గెలిచిన తర్వాత తప్పుకండా వారిపై సర్జికల్ స్ట్రైక్ జరిపిస్తామని బండి సంజయ్ స్పష్టం చేసారు.

ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఓటేస్తే ఎల్ఆర్ఎస్ కు వేసినట్లేనని అన్నారు. టిఆర్ గెలిస్తే బిఆర్ఎస్ తీసుకు వస్తుందన్నారు. బిజెపి గెలిస్తే ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినట్లు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామన్నారు. ఎన్నికల మానిఫెస్టోలో  చేర్చిన అంశాలన్ని  అమలు చేస్తామని తెలిపారు. 125 గజాల లోపు ఇండ్ల నిర్మాణాలకు ఎవరి అనుమతులు అవసరం లేదన్నారు. తెరాస గతంలో చేసిన ఎన్నికల వాగ్దానాలలో  ఒక్కటి కూడ అమలు చేయలేదని అన్నారు. ఇంటికో  ఉద్యోగం ఏదని నిరుద్యోగ భృతి ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రైవేట్  టీచర్లుపస్తులు్ననారని ఆటో డ్రైవర్ల జీవనం అధ్వాన్నంగా మారిందని  వారి కుటుంబాలను ఆదుకున్న పాపాన పోలేదని అన్నారు. అందుకే ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా 7 వేలచొప్పున సహాయం అంద చేస్తామని ఎన్నికల మానిఫెస్టోలో  చేర్చామని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు