ట్రాన్స్ జెండర్ కు జనరిక్ ఫార్మసీ నిర్వహణ బాధ్యతలు


దేశంలోనే తొలిసారిగా 
 లౌక్యం జనరిక్ ఫార్మసీ ని ప్రారంభించిన కమిషనర్


వరంగల్ మహానగర పాలక సంస్థ  ఆధ్వర్యంలో వరంగల్ బస్ స్టేషన్ ప్రాంతంలో   దేశంలోనే తొలి సారిగా  ట్రాన్స్ జెండర్ల కు ఉపాధి కల్పించేందుకు జనరిక్ ఫార్మసీ నిర్వహణను ఏర్పాటు చేసారు.

శుక్రవారం మున్సిపల్  కమిషనర్ పమేలా సత్పతి ఈ ఫార్మసీని  ప్రారంభించారు.

 ట్రాన్స్ జెండర్ లకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ పార్మసీని ఏర్పాటు చేశామని కమిషనర్ పమేలా సత్పతి అన్నారు. ట్రాన్స్ జెండర్స్ ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు  

కార్పొరేషన్ ప్రత్యేక చొరవ తీసుకుందని ఆన్నారు. కార్పోరేషన్ పరిధిలో  ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరించారు. 

 మెప్మా, యు.ఎం.సి. విభాగాల ఆధ్వర్యంలో  స్వయం సహాయక బృందాలతో పాటు ఎస్.ఎల్.ఎఫ్ లు, టి.ఎల్.ఎఫ్ లతో ఫెడరేషన్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. వరంగల్, హన్మకొండ, కాజిపేట( త్రినగరిలో ) చాలామంది ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సభ్యులు ఉన్నారని సమాజంలో సమైక్యత లభించేలా గౌరవంగా జీవించాలనే ఉద్దేశ్యంతో జనరిక్ ఫార్మసీ ని కేటాయించామని  తెలిపారు. జనరిక్ మందులు ఇతర మందులతో పోలిస్తే 1/3  ధరల్లోనే లభ్యమౌతాయని,  ఇలాంటి మెడిసిన్స్ వినియోగం వల్ల పేదవర్గాలు మద్య తరగతి  వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆన్నారు.  ట్రాన్స్ జెండర్ లకు ఇప్పటికే కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్వహణతో పాటు పబ్లిక్ టాయిలెట్ లోని లూ కేఫ్(లక్జరి) లను నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో  కేటాయించామని చెప్పారు.

నర్సరి ల నిర్వహణ కోసం వీరికి ఎస్.హెచ్.జీ. సభ్యులచే శిక్షణ ను ఇప్పించడం జరిగిందని, ఎస్.హెచ్.జీ. వారికి ఏవిధంగా చెల్లిస్తున్నామో అదే విధం గా వీరికి కూడా చెల్లిస్తామని కమిషనర్ తెలిపారు.

 ఈ కార్యక్రమంలో  వెంకట్ రెడ్డి, సామాజిక కార్యకర్త పి.వి. శ్రీనివాస్ మెప్మా పర్యవేక్షకురాలు ప్రసన్న రాణి, టి.ఎం.సి.రమేష్, సానిటరీ ఇన్స్పెక్టర్ కుమార స్వామి, సి.ఓ. శ్రీలత, యు.ఎం.సి. ప్రతినిధి శ్రీమతి వెంకటరమణ, ట్రాన్స్  జెండర్ ల సంఘ అధ్యక్షురాలు లైలా, సభ్యులు శిరి, స్నేహ, అశ్విని, రేష్మ తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు