దుబ్బాక లో ఏం జరుగుతోంది ? !

ఏకపక్షంగానే అధికార పార్టి  డబ్బుల పంపిణి జరుగుతోందా ?
పోలీసులు ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు ?
కేవలం బిజెపి అభ్యర్థి రఘునందనరావునే ఎందుకు టార్గెట్ చేశారు ?


ఎన్నికల్లో డబ్బులు పంచడం ఓ కళ. మూడో కంట పడకుండా నోట్ల పంపకంలో ఎవరు ఆరి తేరితే వారికే అడ్వాంటేజి లభిస్తుంది. ఎందుకంటే రాజకీయ నేతలు చెడి పోయినా ఓటర్లు ఇంకా చెడి పోలేదు.

డబ్బులు పుచ్చుకున్నందుకు మాట మీద నిలబడే  నిజాయితి వారిది. ఓటర్లు నిజాయితీగా ఉండబట్టే ఎవరు ఎక్కువ డబ్బులు పంచగలిగితే వారే నెగ్గుతున్నారు. నాయకుల లెక్కనే ఓటర్లు కూడ ఆడిన మాట తప్పిన రోజుుల రావాలి. అప్పుడు కాని నాయకులకు సిగ్గు రాదు. 

 ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న దుబ్బాకలో పరిస్థితి చూస్తే అక్కడ ఏ పార్టి వారు 'సొక్కం' అని సర్టిఫికేట్ ఇవ్వలేం. టిఆర్ఎస్, కాంగ్రేస్, బిజెపి అన్ని విషయాల్లో హోరా హోరి తల పడుతున్నాయి. 

బిజెపి అభ్యర్థి రఘునందనరావు భందువుల ఇండ్లలో డబ్బులు పంచుతుండగా పోలీసులు సోదాలు నిర్వహించి పట్టు కోవడం ఆ తర్వాత జరిగిన గందరగోళ పరిణామాలు చూస్తే ఓ విషయం అర్దం అవుతోంది. ఇక్కడ ఏక పక్షంగా డబ్బుల పంపిణి జరుగుతోందని చెప్పవచ్చు. ఇతర పార్టీల డబ్బుల పంపిణి జరగకుండా అధికార పార్టి అన్ని హంగులు ఉపయోగిస్తోంది. ఎన్నికల నిర్వహణలో  అధికారంలో ఉన్న పార్టీకి అనేక రీతులలో కల్సివచ్చే అవకాశాలు ఉంటాయి. ఎన్నికల నిర్వహణలో పోలీసులది, రెవెన్యూ శాఖల అధికారులది ప్రధాన పాత్ర ఉంటుంది. వీరంతా అధికార పార్టీకి సుపరిచితులే అయి ఉంటారు.  ఎందుకంటే  వారి దయవల్లే పోస్టింగులు పొంది ఉన్నవారే అయి ఉంటారు కనుక వారి నిజాయితీని కూడ తప్పు  పట్టలేం. ప్రభు భక్తిని నిరూపించు కునేందుకు వారికో సువర్ణావకాశం. దుబ్బాకలో అధికార యత్రాంగం ప్రభువుల

దీక్ష పూనింది.  బిజెపి అభ్యర్థి రఘునందనరావు భందువుల ఇంట్లో సోదాలు జరిగిన నేపద్యంలో ఆసలు డబ్బులు లభించ లేదని పోలీసులే డబ్బుల సంచి తెచ్చి ఇంట్లో పెట్టే ప్రయత్నాలు చేసి కేసులు పెట్టేందుకు కుట్ర చేశారని బిజెపి నేతలు ముందు రాంగ్ ప్రబగండ చేసారు కాని అందులో ఫెయిల్ అయ్యారు. పోలీస్ కమీషనర్ సోదాల వీడియోలు విడుదల చేయడంతో బిజెపి వారికి కౌంటర్ లేకుండా పోయింది. దీక్షలు ముట్టడి కార్యక్రమాలతో నిరసనలకు పరిమితం అయ్యారు. ఎక్కడి కక్కడ హౌజ్ అరెస్టులు చేసి వాటిని కూడ పోలీసులు భగ్నం చేశారు.  

రఘునందనరావు భంధువుల ఇంట్లో డబ్బులు దొరకడం వాస్తవం. అందులో డౌట్ అవసరం లేదు. కాని పోలీసులే ఏకంగా డబ్బులు తెచ్చి బిజెపి నేతల ఇండ్లలో పెట్టి తప్పుడు కేసులు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించడం సరికాదు.  కాక పోతే పోలీసులు ఇతరత్రా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బంది ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పడంలో   నిజాలు ఉన్నాయి. పాపం రఘునందనరావును నీడలా వెంటాడుతున్నారు. ఇప్పటి వరకు కేవలం బిజెపి పార్టి అభ్యర్థి డబ్బులే పట్టు బడ్డాయి.  మరి అధికార పార్టి డబ్బులు పంచడం లేదా ? ఎందుకు డబ్బులు  పట్టు కోవడం లేదంటూ సాధారణంగా అందరూ లేవ నెత్తుతున్న ప్రశ్నలు. అధికార టిఆర్ఎస్ పార్టి ఇండ్లలో ఎందుకు సోదాలు జరగడం లేదని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ డబ్బుల పంపణి ఏకపక్షంగా కేవలం అధికార పార్టీ మాత్రమే పంచాలని ఇతర పార్టీలు డబ్బులు పంచకుండా కట్టడి చేస్తే చాలని గెలిపు తమదే అవుుతందని అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. 

అందుకే పోలీసులు దుబ్బాకలో పూర్తిగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బిజెపి ఎంపీలైన బండి సంజయ్, అరవింద్ పట్ల పోలీసులు కనీస మర్యాదలు కూడ పాటించలేదన్న విమర్శలు వచ్చాయి.

దుబ్బాకలో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రేస్  పార్టీల మద్యే  ప్రధానంగా త్రిముఖ పోటి జరుగుతోంది. ఇతర పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్లు కల్సి మొత్తం 23 మంది పోటీలో ఉన్నారు. 

దుబ్బాకలో అధికార పార్టి ఎన్ని రకాల అధికార దుర్వినియోగానికి పాల్పడాలో అన్ని రకాలుగా అధికార దుర్వినియోగం చేస్తోందన్న  విమర్శలు ఉన్నాయి. సిట్టింగ్ సీటు కావడం వల్ల టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుుకుంది. టిఆర్ఎస్ వోడిపోతే ఇక అంతే సంగతులు. దుబ్బాకలో ఓడిపోతే కెసిఆర్ కు టిఆర్ఎస్ పార్టీకి పతనం మొదలై నట్లే అని భావించ వచ్చు.  అందుకే కెసిఆర్ తనకు పార్టీకి కట్టుబడి ఉండే కట్టప్ప లాంటి హరీశ్ రావుకు భాద్యతలు అప్పగించారు.  హరీశ్ రావు  విపక్షాలను అన్ని విధాలా ముప్పు తిప్పలు పెడుతూ దుబ్బాకలో దుమ్ము రేపుతున్నాడు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు