కిషన్ రెడ్డికి- కేసీఆర్ కు మద్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటో చెప్పాలి : రేవంత్ రెడ్డి


తెలంగాణ సిఎం కెసిఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మద్య మాచ్ ఫిక్సింగ్ ఉందా ? 
సిఎం కెసిఆర్ కు  బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మద్య ఏమాచ్ ఫిక్సింగ్ నడుస్తుందో చెప్పాలని కాంగ్రేస్ పార్టి ఎంపి రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు.  బిజెపిలో టిఆర్ఎస్ అనూకూల వ్యతిరేక వర్గాలున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ పార్టి తమ బుట్టలోనిదే అని తమ జోలికి రాదని ఇన్ని రోజులు భావించారని తమ వరకు వచ్చే వరకు అసలు తత్వం బోదపడలేదని అన్నారు. బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ని చెంప దెబ్బకొట్టినప్పుడు పోలీసులపై చర్యలు తీసుకోక పోవడం వల్లే ఇప్పుడు చంపాలని ప్రయత్నం చేసారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ప్రత్యేక సెక్యూరిటీ ఇచ్చిన కేంద్రం  తమ సొంత ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎందుకు భద్రత కల్పించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దుబ్బాకలో జరిగిన సంఘటనపై కిషన్ రెడ్డి ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు.  కేంద్ర మంత్రిగా అధికారులను పిలిచి విచారించే హోదా కిషన్ రెడ్డికి ఉందన్నారు. కరీంనగర్ లో దీక్ష చేపట్టిన బండి సంజయ్ ని అక్కడే ఉన్న మురళీధర్‌రావు, విద్యాసాగర్ రావు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని గెలిచేందుకు టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ ను కాదని కేంద్రంలో ఉన్న‌ బీజేపీ తెలంగాణ లో ఏం చేయద‌ని, హరీష్ ప్రచారం చేస్తే శాంతి భ‌ద్ర‌తలు తలెత్తనప్పుడ బంజడి సంజయ్ వెళ్తే ఎందుకు శాంతి భ‌ద్ర‌తలు తలెత్తుతాయ‌ని ప్ర‌శ్నించారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు