ట్రిపుల్ ఆర్ లో తారక్ టోపిపై వివాదం - రాజమౌళికి ఆదివాసి సంఘాల వార్నింగ్ ?

 భీం పాత్రలో ఉన్న ఎన్టీఆర్ నెత్తిన టోపి చూసి మండి పడిన ఆదివాసి సంఘాలు

రాజమౌళిని హెచ్చిరించిన బిజెపి ఎంపి సోయం బాబూ రావు



చారిత్రక ప్రాధాన్యత కలిగిన సినిమాలు తీసే ముందు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. బాహుబళి సినిమా తో అగ్ర శ్రేణి దర్శకుడిగా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుుడ ఆర్ఆర్ఆర్ సినిమాతో అప్రతిష్ట పాలు అవుతారా ? 

తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా టీజర్ రెండో పార్ట్ విడుదల చేసిన తర్వాత రాజమౌళిపై ఆదివాసీలు మండి పడుతున్నారు.  ఇద్దరు అగ్రశ్రేణి యువ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సంయుక్తంగా నటిస్తున్న సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం నేపధ్యం కలిగిన పాత్రలో కనిపించ బోతున్నట్లు టాక్ వచ్చింది.  రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు నేపద్యం  కలిగిన పాత్రలో నటించ బోతున్నారని టీజర్లను బట్టి అర్దం అవుతోంది. అయితే కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లాల్చి పైజామాలో నెత్తిన ముస్లీం లు ధరించే టోపి తో చూపించడం పై 

రక రకాల విశ్లేషణలతో విమర్శలు వచ్చాయి. అసలు నిజాం సర్కారుకు వ్యతిరేకంగా బందూకు పట్టి పోరాడిన కొమురం భీం పాత్ర లో ఉన్న ఎన్టీఆర్ నెత్తి మీద ఆ టోపి ఏంటని ప్రశ్నించారు. వివాదంగా మారిన పాత్రపై వచ్చిన విమర్శలకు జర్శకుడు రాజమౌళి ఇంత వరకు వివరణ ఇవ్వలేదు. చారిత్రక నేపద్యం కలిగిన పాత్రల కథాంశాలను సినిమాగా తీస్తున్నపుడు చరిత్ర కారులను లేదా ఆ నేపద్యం తెల్సిన విద్యావంతులను ఒకటికి రెండుసార్లు సంప్రదించి ఎవరి మనో  భావాలు దెబ్బతినకుండా పాత్రలు మలిస్తే బాగుంటుంది. కాని రాజమౌళి  కథాంశమేమిటో  కొమురం భీం పాత్రలో నిజంగా జూనియర్ ఎన్టీఆర్  నటిస్తుంటే నెత్తి మీద టోపి ఎందుకు పెట్టారో అనే విషయంపై స్పష్టత లేదు. 

ఇప్పటికే పలు ఆదివాసి సంఘాలు దర్శకుడు రాజమౌళిని తీవ్రంగా హెచ్చరించాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీమ్ చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని దర్శకుడు రాజమౌళిని ఆదిలాబాద్‌ బీజేపీ ఎంపీ సోయం బాపురావు హెచ్చరించారు. నిజాం తో పోరాటం చేసిన కొమరం భీమ్‌కు ఇతర మతాలతో అంటగట్టి   టోపీ పెట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అదే విధంగా టోపీ ఉన్న సన్నివేశాలను తొలగించాలని, లేకపోతే సినిమా థియేటర్లపై దాడి చేసే అవకాశం ఉదని హెచ్చరించారు. కొమరం భీమ్ తమ పాలిట దేవుడని, ఉన్నది ఉన్నట్టు చూపిస్తే తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని అన్నారు. అంతేగానీ కలెక్షన్ల కోసం పాత్రను వక్రీకరిస్తే బాగోదని అన్నారు. 

చారిత్రక పాత్రలను కళాత్మకంగా చిత్రీకరించాలని ఊహాజనిత సన్ని వేశాలు జొప్పిస్తే సినిమా కు డబ్బులు అయితే రావచ్చు కాని ఈ సినిమా తీసిన వారిని ఏ ఖాతాలో జమ చేస్తారో ఈ మద్య బయోపిక్ లు తీసే తిక్కల దర్శకుడు  వర్మను చూస్తే తెలుస్తుంది.  

వివాదం ఏమైనా ఉంటే సినిమా విడుదలకు ముందే క్లారిటి ఇస్తే మంచిది. తీరా సినిమా విడుదల అయిన తర్వాత గొడవల కంటే ముందే  తన కాథాంశ మేమిటో చెప్పక పోయినా ఎన్టీఆర్ పోషించే పాత్రకు ఎందుకు టోపి పెట్టాల్సి వచ్చిందో క్లారిటి ఇస్తే  రాజమౌళి జెంటిల్ మెన్ అనిపించుకుంటాడు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు